Sai Pallavi: సాయి పల్లవికి ఇది అతిపెద్ద సవాల్… నెగ్గుతుందా!
తెలుగు తమిళ మలయాళంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆమె త్వరలోనే బాలీవుడ్ లో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయని నార్త్ మీడియా కోడై కూస్తోంది.

Sai Pallavi: పురుషులందు పుణ్య పురుషులు వేరయా ! అన్నట్లు హీరోయిన్స్ నందు సాయి పల్లవి వేరయా అని కచ్చితంగా చెప్పవచ్చు. హీరోయిన్స్ ఎప్పుడు లైమ్ లైట్ లో ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు. స్టార్ హీరోతో సినిమా అంటే చాలు కళ్లు మూసుకొని ఒప్పుకుంటారు. కానీ సాయి పల్లవి అలా కాదు, సినిమాలో తన పాత్ర కు ప్రాధాన్యత ఉందని అనిపిస్తే తప్ప ఎంత స్టార్ హీరో అయిన సినిమా చేయదు. కొందరు హీరోయిన్స్ మొదటి లో పద్దతిగా కనిపించిన అవకాశాల కోసం గ్లామరస్ పాత్రలకు ఒప్పుకుంటారు. కానీ ఆ విషయంలో సాయి పల్లవి ఎప్పుడు కూడా గీత దాటలేదు. బహుశా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సౌత్ హీరోయిన్స్ లో సూపర్ స్టార్ గా వెలుగొందుతోంది.
తెలుగు తమిళ మలయాళంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆమె త్వరలోనే బాలీవుడ్ లో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయని నార్త్ మీడియా కోడై కూస్తోంది. పైగా ఒక స్టార్ హీరో కొడుకు సరసన ఆమె నటించబోతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో అగ్ర హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. అతనిని పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఒక సినిమాను నిర్మిస్తోంది. దీనితో పాటు అతని రెండో సినిమా కూడా మొదలైయే అవకాశం ఉంది.
అతని రెండో సినిమా ను అమీర్ ఖాన్ సన్నిహితుడు సునీల్ పాండే తెరకెక్కిస్తారని సమాచారం. పూర్తి ప్రేమ కథ తో రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి అయితేనే న్యాయం చేస్తుందని భావించి సునీల్ పాండే ఆమెను తీసుకోవడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు సాయి పల్లవి నుంచి కానీ సునీల్ పాండే నుంచి దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
అయితే సాయి పల్లవి హిందీలో రాణిస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. అది సవాళ్లతో కూడిన పరిశ్రమ. అవుట్ సైడర్స్ ని ఏమాత్రం ఎక్కి రానీరు. దారుణమైన పాలిటిక్స్. స్టార్స్ గా వెలుగొందిన ప్రియాంక చోప్రాకు కూడా వేధింపులు తప్పలేదు. హిందీ పరిశ్రమలో అనారోగ్య పూరిత వాతావరణం ఉందని కాజల్ అగర్వాల్ స్వయంగా చెప్పారు. రాజకీయాలు పక్కన పెడితే గ్లామర్ డాల్స్ వెంటపడే పరిశ్రమలో సహజ సుందరిని ఆదరిస్తారా అనే సందేహం కూడా ఉంది. ఇలా పలు సవాళ్లు సాయి పల్లవి ముంగిట ఉన్నాయి.
