Pawan Kalyan : రాష్ట్రమంతా జనంతో మమేకం కావటానికి పవన్ కళ్యాణ్ కిది అందివచ్చిన అవకాశం
సినిమా షూటింగ్ లకు పవన్ వెళ్లాడని తెలిసింది. కొన్ని రోజులు కాల్షీట్లు ఇచ్చాడని అంటున్నారు. ఇచ్చినా ఎక్కువ సమయం రాజకీయాలకు పవన్ కేటాయిస్తే ఆయనకు తిరుగుండదు.
Pawan Kalyan : ఆంధ్రాకు ముందస్తు ఎన్నికలు ఇక లేనట్లేనని అనుకోవాలి. ఆగస్టు నెల గడుస్తున్నా చప్పుడు లేకపోవడంతో ఇక లేనట్లే.. నవంబర్ , డిసెంబర్ కల్లా ఆ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మరో మూడు నెలలు మాత్రమే టైం ఉంది. ఏపీ ఎన్నికలు ఏప్రిల్, మే నెలలోనే జరుగబోతున్నాయి. ఒక విధంగా ఇది పవన్ కళ్యాణ్ కు కలిసి వచ్చిన అదృష్టంగా చెప్పొచ్చు.
ఏపీలో ముందస్తు ఎన్నికలు లేకపోవడం పవన్ కళ్యాణ్ కు వరంగా మారాయి. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా తిరగడానికి… కేడర్ లో ఉత్తేజం నింపడానికి.. మొత్తం నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవడానికి ఈ అవకాశం దక్కింది.
సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ ఆరు నెలల వరకూ పవన్ కు టైం ఉంది. ఇప్పటికే తమిళనాడులో అన్నామలై ఆరు నెలల పాదయాత్రలో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. కంచుకోటలు అయినటువంటి మూడు కోస్తా జిల్లాల్లో పవన్ పర్యటించారు. అక్కడ జనసేనకు హైప్ తీసుకొచ్చారు. ఈ ఆరునెలల సమయాన్ని వృథా చేయకుండా పూర్తికాలం రాజకీయాలకు వెచ్చించి వారాహి యాత్రలు ప్లాన్ చేసుకుంటే ఆంధ్రాలో జనసేన వేవ్ వచ్చే అవకాశం ఉంది.
సినిమా షూటింగ్ లకు పవన్ వెళ్లాడని తెలిసింది. కొన్ని రోజులు కాల్షీట్లు ఇచ్చాడని అంటున్నారు. ఇచ్చినా ఎక్కువ సమయం రాజకీయాలకు పవన్ కేటాయిస్తే ఆయనకు తిరుగుండదు.
ఏపీలో ‘జనసేనకు’ గల అవకాశాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
