Vijay Devarakonda- ED: టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. పూరి జగన్నాథ్, ఛార్మి దర్శక నిర్మాతలుగా తెరకెక్కించిన లైగర్ మూవీ విషయంలో అవకతవకలు జరిగాయి. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారనే సమాచారంపై ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో పూరి-ఛార్మిలను ఈడీ అధికారులు ప్రశ్నించారు. లైగర్ మూవీ బడ్జెట్ ఎంత? డబ్బులు ఎక్కడ నుండి సమకూరింది? లైగర్ చిత్ర బిజినెస్ ఎంత? ఆ డబ్బులు ఏం చేశారు? ఇలా అనేక కోణాల్లో గంటల తరబడి ఈడీ అధికారులు ప్రశ్నించారు.

Vijay Devarakonda- ED
తాజాగా లైగర్ చిత్ర హీరో విజయ్ దేవరకొండ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. దాదాపు 11 నుండి 12 గంటలు ఆయన విచారణ సాగింది. ఎంక్వైరీ ముగిసిన అనంతరం మీడియాతో విజయ్ దేవరకొండ మాట్లాడారు.
మీ ప్రేమాభిమానాల వలన పాపులారిటీ వస్తుంది. దాని సైడ్ ఎఫెక్ట్స్ గా ఇది చెప్పుకోవచ్చు. అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. వాళ్లకు సహకరించాను.అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. 12 గంటలు విచారించారు. నన్ను మళ్ళీ విచారణకు రమ్మని చెప్పలేదు. ఇది ఒక అనుభవం. గుడ్ నైట్ అంటూ… అక్కడి నుండి వెళ్లిపోయారు. కొంతలో కొంత తన విచారణ గురించి విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

Vijay Devarakonda
కాగా విజయ్ దేవరకొండను లైగర్ మూవీ రెమ్యూనరేషన్ గురించి ప్రత్యేకంగా ప్రశ్నించినట్లు అందుతున్న సమాచారం. లైగర్ చిత్రానికి మీరు ఎంత తీసుకున్నారు? ఆ డబ్బులు మీకు ఎలా ఇచ్చారు? వంటి ప్రశ్నలు అడిగారట. సుదీర్ఘ విచారణలో అనేక విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది.ఇక రూ. 25 కోట్లు విజయ్ దేవరకొండకు రెమ్యూనరేషన్ గా ఇస్తామని పూరి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. లైగర్ పరాజయం నేపథ్యంలో ఎంత మొత్తం ఇచ్చాడనేది తెలియదు. కాగా కరణ్ జోహార్ లైగర్ చిత్ర నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. మరి ఆయన కూడా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందా, అనే సందేహాలు కలుగుతున్నాయి.