TDP: టీడీపీపై ఇదో కుట్ర కోణం.. సోషల్ మీడియాలో దారుణం

తెలంగాణ పరిస్థితులను చూసిన ఏపీలో.. ముందుగానే పార్టీలు అప్రమత్తమయ్యాయి. ప్రత్యర్థి పార్టీలపై ప్రచారం ప్రారంభించాయి. ముందుగా వైసిపి సోషల్ మీడియాతెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసింది.

  • Written By: Dharma
  • Published On:
TDP: టీడీపీపై ఇదో కుట్ర కోణం.. సోషల్ మీడియాలో దారుణం

TDP: తెలంగాణలో ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతోంది. పట్టుమని వారం రోజుల వ్యవధి కూడా లేదు. ప్రచార హోరుతో పార్టీలు ప్రత్యర్థులను చెమటలు పట్టిస్తున్నాయి. ఈ మీడియా, ఆ మీడియా అన్న తేడా లేకుండా నేరుగా ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ భారీ స్థాయిలో ప్రకటనలు ఇస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే చేయబోయే పనులు చెప్పడం కంటే.. ప్రత్యర్ధులు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి.అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది.అదే బిఆర్ఎస్ కు నష్టం చేస్తోంది. అందుకే ఆ పార్టీ సైతం అదే తరహా ప్రచారానికి దిగుతోంది.

అయితే తెలంగాణ పరిస్థితులను చూసిన ఏపీలో.. ముందుగానే పార్టీలు అప్రమత్తమయ్యాయి. ప్రత్యర్థి పార్టీలపై ప్రచారం ప్రారంభించాయి. ముందుగా వైసిపి సోషల్ మీడియాతెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసింది. ఇటీవల పరిణామాలతో రాయలసీమలో వైసిపి గ్రాఫ్ తగ్గింది అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే వైసిపి సోషల్ మీడియా అలెర్ట్ అయ్యింది. వైసిపి చేసే మంచి పనులను, టిడిపి అధికారంలోకి వస్తే జరగబోయే పరిణామాలను ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడు హెచ్చరిస్తూ సాగిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సొంత పార్టీ నాయకుడే చంద్ర బాబు విధానాలను వ్యతిరేకిస్తున్నట్టు.. జగన్ చేసిన అభివృద్ధిని చెబుతూ.
.. వ్యంగ్యో క్తులతో సాగిన ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది.

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో.. పసుపు కండువాతో.. అచ్చం టిడిపి నాయకుడు మాదిరిగాఆ వ్యక్తి మాట్లాడుతుండడం విశేషం. అయితే దీనిపై టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి. రాయలసీమలో టిడిపి బలోపేతం అయ్యిందన్నడానికి వైసిపి ఈ తరహా ప్రచారం చేయడాన్ని ఉదహరిస్తున్నారు. అయితే ఎన్నికల ముంగిట వైసీపీ సోషల్ మీడియా ఎంతకైనా తెగిస్తుందని.. ఇప్పటికే టిడిపి నాయకుల ఫేక్ లేఖలతో ప్రకటనలు చేస్తున్నారని.. ఇప్పుడు రాయలసీమలో పార్టీపై పెద్ద కుట్ర జరుగుతోందని.. టిడిపి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే టిడిపి పై కుట్ర కోణం బయటపడడంతో ఆ పార్టీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. వైసిపి సోషల్ మీడియాకు ధీటుగా.. ఐటిడిపి ఆలోచన చేస్తుండడం.. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో అన్న ఆందోళన ప్రజల నుంచి వ్యక్తం అవుతోంది.

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు