American Express Credit Card : ఈ క్రెడిట్ కార్డు ఉండేవారికి బంపర్ ఆఫర్

అమెరికన్ ఎక్స్ ప్రెస్ బ్యాంకు గురించి కొంత మందికి తెలిసే ఉంటుంది. ఈ బ్యాంకు కార్డు ఉన్నవారికి భారీ ఆఫర్ వచ్చింది. అయితే ఇది విదేశీ ప్రయాణికులకే అవకాశం.

  • Written By: SS
  • Published On:
American Express Credit Card : ఈ క్రెడిట్ కార్డు ఉండేవారికి బంపర్ ఆఫర్

American Express Credit Card : ఒకప్పుడు ఉన్నతస్థాయి ఉద్యోగులు, పెద్ద పెద్ద వ్యాపారం చేసేవారికి మాత్రమే ఇచ్చేశారు. కానీ ఇప్పుడు చిరు ఉద్యోగులకు కూడా చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డు ఆఫర్ చేస్తున్నారు. అవసరమున్నవారు తక్కవ బ్యాలెన్స్ తో తీసుకొని ఆ తరువాత తమ సివిల్ స్కోరును పెంచుకొని పెద్ద మొత్తంలో క్రెడిట్ లిమిట్ ను సాధిస్తున్నారు. వడ్డీ లేకుండా అవసరానికి అప్పుఇచ్చే క్రెడిట్ కార్డు వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. క్రెడిట్ కార్డు వాడడం వల్ల రివార్డ్స్ వస్తుంటాయి. దీంతో కొన్ని వస్తుువులను ఉచితంగా కొనుగోలు చేయొచ్చు. అయితే ఓ బ్యాంక్ క్రెడిట్ కార్డు భారీ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా 12 శాతం రివార్డును ప్రకటించింది.

అమెరికన్ ఎక్స్ ప్రెస్ బ్యాంకు గురించి కొంత మందికి తెలిసే ఉంటుంది. ఈ బ్యాంకు కార్డు ఉన్నవారికి భారీ ఆఫర్ వచ్చింది. అయితే ఇది విదేశీ ప్రయాణికులకే అవకాశం.  అదేంటంటే ప్రతీ ఫ్లైట్ బుకింగ్ పై రూ.10 వేల వరకు రివార్డు పొందవచ్చు. అంతర్జాతీయ విమాన టికెట్లు బుక్ చేసుకుంటే ఏకంగా 12 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. పెద్ద మొత్తంలో బుక్ చేసుకున్నవారు గరిష్టంగా రూ.10 వేల వరకు రివార్డు పొందవచ్చని తెలిపింది.

ఆన్లౌన్లో వస్తువులను క్రెడిట్ కార్డు ద్వారా వస్తువులు కొనుగోలు చేసేవారికి డిస్కౌంట్లు వస్తుంటాయి. ఇప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నవారికి కూడా ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. అయితే దీనిని అన్లౌన్లోనే బుక్ చేసుకోవాలి. ఈ ఆఫర్ జూన్ 30 వరకు గడువు విధించారు. ఈలోగా విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఇతరులకు ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేవారు ఒకేసారి మొత్తం చెల్లించాలన్న నిబంధన లేదు. ఈఎంఐ సౌకర్యాన్ని కూడా ఈ బ్యాంకు కల్పించింది. దీంతో ఇది విద్యార్థులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.

ఇదే క్రెడిట్ కార్డుపై రూ.50 వేలకు పైగా ఖర్చు చేస్తే రూ.2 వేల విలువైన వోచర్ వస్తుంది. ఇలా వచ్చిన వోచర్ ను ఆమెజాన్, ఫ్లిప్ కార్డు లో వాడుకోవచ్చు. ఏ వస్తువైనా కొనుక్కోవచ్చు. అమెరికన్ ఎక్స్ ప్రెస్ కార్డు ద్వారా షాపింగ్ కూడా చేయొచ్చు. ఇలా చేయడం వల్ల త్వరగా మైల్ స్టోనుకు చేరుకుంటారు. అప్పుడు చాలా వోచర్లు పొందుతారు. ఇవే కాకుండా ఈ కార్డు ద్వారా పలు బెనిఫిట్స్ పొందవచ్చు.

Read Today's Latest Business News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు