Chandrababu: చంద్రబాబు చరిత్రలో ఇదో బ్యాడ్ రికార్డ్

చంద్రబాబు 14 సంవత్సరాల పాటు సీఎం గా పని చేశారు. మరో 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. బహుశా ఏపీలో ఈ ట్రాక్ రికార్డు ఎవరికీ లేదు.

  • Written By: Dharma
  • Published On:
Chandrababu: చంద్రబాబు చరిత్రలో ఇదో బ్యాడ్ రికార్డ్

Chandrababu: ఏపీ పొలిటికల్ హిస్టరీలో చంద్రబాబుది ఒక సరికొత్త ట్రాక్ రికార్డ్. ఉమ్మడి ఏపీలో ఎక్కువ కాలం సీఎంగా ఉన్నది ఆయనే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వరకు కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీఎంలుగా పని చేశారు. కానీ ఎప్పటికప్పుడు మారుతూ వచ్చారు. అటు ఎన్టీఆర్ సైతం 1985లో గెలిచి.. 1989లో ఓడిపోయారు. 1994 లో అధికారంలోకి వచ్చినా.. అక్కడికి కొద్ది రోజులకే సీఎం పదవికి దూరమయ్యారు. అప్పటినుంచి చంద్రబాబు శకం ప్రారంభమైంది.

చంద్రబాబు 14 సంవత్సరాల పాటు సీఎం గా పని చేశారు. మరో 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. బహుశా ఏపీలో ఈ ట్రాక్ రికార్డు ఎవరికీ లేదు. ఉమ్మడి ఏపీలో 9 ఏళ్ల పాటు సీఎం గా పని చేశారు. ఎన్టీఆర్ సైతం ఏడేళ్లకే పరిమితమయ్యారు. రాజశేఖర్ రెడ్డి ఆరు సంవత్సరాలు పాలన సాగించారు. ఎన్టీఆర్ ఐదేళ్లపాటు, రాజశేఖర్ రెడ్డి ఐదేళ్ల పాటు మాత్రమే ప్రతిపక్ష నేతలుగా పదవులు చేపట్టారు. అటు అవశేష ఏపీ తొలి ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబుది ఒక రికార్డ్.

అయితే ఇన్ని రికార్డులు అధిగమించిన చంద్రబాబు.. జైలుకెళ్లడం ద్వారా మరో రికార్డును సొంతం చేసుకున్నారు. అవినీతి కేసులో జైలుకెళ్లిన తొలి మాజీ ముఖ్యమంత్రిగా గుర్తించబడ్డారు. జలగం వెంగళరావు, ప్రకాశం పంతులు హయాం నుంచి తీసుకుంటే విమర్శలు, ప్రతి విమర్శలు, అవినీతి ఆరోపణలు చేసుకున్నారే తప్ప.. ఏ ఒక్కర్నీ జైలులో పెట్టించిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం మాజీ గా మారిన చంద్రబాబును జైలుకు పంపించడంలో జగన్ సక్సెస్ అయ్యారు. జగన్ జైలుకు వెళ్లిన తరువాత సీఎం అయ్యారు. ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వచ్చి అవినీతి ఆరోపణలపై జగన్ ను జైలుకు పంపిస్తే.. జైలుకు వెళ్లిన రెండో ముఖ్యమంత్రిగా జగన్ గుర్తించబడతారు. కానీ తొలిసారిగా జైలుకెళ్లిన మాజీ సీఎం లలో చంద్రబాబు రికార్డు దక్కించుకున్నారు.

ఇప్పటివరకు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీలుగా చంద్రబాబు తో పాటు మరో ఇద్దరు మాజీ సీఎంలు ఉండేవారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మర్రి చెన్నారెడ్డి ఇదే జైలులో రిమాండ్ ఖైదీగా ఉండేవారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో టంగుటూరి ప్రకాశం పంతులు సైతం ఇదే జైలులో ఖైదీగా గడిపారు. అయితే వారిద్దరూ సీఎంలు కాక మునుపు ఖైదీలుగా ఉండేవారు. చంద్రబాబు మాత్రం సీఎంగా అవినీతి మరక అంటించుకుని జైలుకు వచ్చారు. ఇలా ఎలా చూసుకున్నా చంద్రబాబుది అరుదైన రికార్డే.

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు