Vimala Raman: ఒకప్పటి ఈ హీరోయిన్ ఓ విలన్ కు భార్య కాబోతుంది..!
తెలుగులో వరుణ్ సందేశ్ తో కలిసి 2009లో ‘ఎవరైనా ఎప్పుడైనా’ మూవీతో అడుగుపెట్టింది. ఆ తరువాత జగపతిబాబుతో ఎక్కువ సినిమాలు చేసింది. వీరి కాంబోలో ‘గాయం-2’, ‘ చట్టం’ సినిమాలో వచ్చాయి.

Vimala Raman: ఒకప్పుడు ఆమె సాధారణ హీరోయిన్. తెలుగు, తమిళం సినిమాల్లో నటించిన ఈమెకు తెలుగు సినిమాలతో గుర్తింపు వచ్చింది. ఆ తరువాత అవకాశాలు వస్తాయనుకుంది. కానీ దురదృష్టం ఆమెను వెంటాడింది. అనుకున్న ఛాన్సెస్ రాలేదు. కొన్ని రోజులు పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. లేటేస్టుగా ఆమె సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోస్ ను పెట్టడంతో అవి వైరల్ అయ్యాయి. 40 ఏళ్ల వయసు పైబడిగా ఆమె ఈ ఫొటోల్లో ఎంతో అందంగా ఉండడంతో కుర్రకారు ఆమె గురించి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా సినిమాల్లో ఎంతో మంది హీరోల పక్కన హీరోయిన్ గా నటించిన ఆమె ఓ విలన్ తో డేటింగ్ లో ఉంది. అంతేకాకుండా త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆమె ఎవరనేదేగా మీ సందేహం?
ఈ బ్యూటీ ఎవరో కాదు విమల రామన్. ఈ పేరు చాల మందికి తెలియదు. కానీ జగపతి బాబు ‘గాయం-2’ సినిమా చూస్తే గుర్తుపడుతారు. ఇందులో హాట్ హాట్ గా కనిపించిన విమలారామన్ ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించింది. ఆస్ట్రేలియాలో పుట్టి అక్కడే చదువు పూర్తి చేసిన విమల సినిమాల్లో నటించాలన్న కోరికతో ఇండియాకు వచ్చింది. 2006లో తమిళ మూవీ ‘పోయ్’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది.
తెలుగులో వరుణ్ సందేశ్ తో కలిసి 2009లో ‘ఎవరైనా ఎప్పుడైనా’ మూవీతో అడుగుపెట్టింది. ఆ తరువాత జగపతిబాబుతో ఎక్కువ సినిమాలు చేసింది. వీరి కాంబోలో ‘గాయం-2’, ‘ చట్టం’ సినిమాలో వచ్చాయి. త్వరలో మరో మూవీ ‘రుద్రంగి’ రాబోతోంది. 2017లో ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమాలో కనిపించిన విమల రామన్ ఆ తరువాత సినిమాల్లో కనపించడం మానేశారు. చాన్స్ లు రాకపోయేసరికి తిరిగి సిడ్నీలోనే ఉంటున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ యాక్టివ్ గానే ఉంటుంది. ఆమె లేటేస్ట్ ఫొటోస్ చూసి కుర్రాళ్లు ఆగలేకపోతున్నారు.
ఇక విమలరామన్ వినయ్ రాయ్ అనే నటుడితో డేటింగ్ లో ఉంది. ఆయన సినిమాల్లో విలన్ గా నటిస్తున్నారు. వీరికి సంబంధించిన కొన్ని ఫొటోలను విమలా రామన్ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేయడంతో ఇక వీరు త్వరలో పెళ్లి చేసుకుంటారని అంటున్నారు. కానీ ఆమె మాత్ర వారి పెళ్లి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఇక విమలా రామన్ లేటేస్టుగా వస్తున్న ‘రుద్రంగి’లో ఎలాంటి పాత్రలో కనిపిస్తారో చూద్దాం..
