Vastu Tips- Peony Flower: ప్రస్తుత కాలంలో యువత ధోరణిలో మార్పు వస్తోంది. జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా యువత ఆలోచన చేస్తోంది. దీంతో పెళ్లీడు వచ్చినా వివాహం చేసుకోక అలాగే ఉండిపోతున్నారు. ఆకలంత పోయినాక అన్నమెందుకు? ఈడంత పోయినాక పెళ్లెందుకు అనే సామెత పూర్వం రోజుల్లో ఉండేది. ప్రస్తుతం దానికి భిన్నంగా ఆలోచిస్తున్నారు. కెరీర్ బాగుంటేనే పెళ్లికి ముందుకు వస్తున్నారు. లేదంటే ముప్పై ఐదేళ్లు వచ్చినా ఇంకా బ్యాచ్ లర్ గానే ఉంటున్నారు. దీంతో తల్లిదండ్రులు నిరాశ చెందుతున్నారు. తమ పిల్లల పెళ్లి ఎప్పుడు చేయాలనే ధోరణిలో పడిపోతున్నారు. ఈనేపథ్యంలో పెళ్లిళ్లు చేసుకోవడం ఆలస్యమే అవుతోంది. దాని ప్రభావం జీవితం మీద కూడా పడుతోంది.

Vastu Tips- Peony Flower
అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లే శని ఉందన్నట్లుగా పెళ్లికి సిద్ధమైనా కొందరికి మ్యారేజ్ ఆలస్యమవుతోంది. దీంతో వారి తల్లిదండ్రులు నానా తంటాలు పడుతున్నారు. మా ఇంటికి ఏదో వాస్తు దోషం ఉందేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల పెళ్లి ఎలా చేయాలని ఆపసోపాలు పడుతున్నారు. వివాహం ఆలస్యం అవడంతో పెళ్లి అవుతుందో లేదో అనే బెంగ వారిని వెంటాడుతోంది. కొన్ని సందర్భాల్లో పిల్ల ఓకే అయినా ముహూర్తాలు మాత్రం కుదరక ఇబ్బందులు పడుతున్న సంఘటనలు కూడా ఉంటున్నాయి.
ఈ నేపథ్యంలో ఇంటికి వాస్తు దోషమే కారణమని భావించే వారు కూడా ఉన్నారు. దీంతో వివాహం ఆలస్యం అవుతుందని మథన పడుతున్నారు. పెళ్లి ఆలస్యానికి ఇంటి వాస్తుకు సంబంధం ఉంటే దానికి కూడా ఓ చక్కని పరిష్కార మార్గం ఉంది. వాస్తు శాస్త్రంలో ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి ఓ ఉపాయం చెప్పారు. మన ఇంటి ఆవరణలో ప్యూనీ పూల మొక్కను నాటుకుంటే సరి. వాస్తు దోషం పటాపంచలైపోతుందని నమ్ముతున్నారు. ఈ మొక్కను నర్సరీలో కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే వస్తుంది.

Vastu Tips- Peony Flower
దీన్ని నైరుతి దిశలో నాటుకుంటే మంచిది. ఇంటికి వాస్తు దోషం లేకుండా చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పూలల్లో రాణిగా దీన్ని చెబుతారు. చూడటానికి దీని పూలు అందంగా ఉంటాయి. నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చేలా చేస్తాయి. దీంతో దీని పూలు వాస్తు ప్రకారం మంచి ఫలితాలు ఇస్తాయనడంలో సందేహం లేదు. ఎవరి ఇంటిలో పెళ్లి జరగక ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారు తమ ఇంటిలో ఈ మొక్కను నాటుకుని చూడండి. ఫలితం మీకే తెలుస్తుంది.