Photo story: ఈ క్యూట్ బేబీ 20 ఏళ్లుగా స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతోంది..
Photo story: సినిమా ఇండస్ట్రీలో ఎక్కువకాలం రాణించాలంటే సాధ్యం కాని పని. ముఖ్యంగా హీరోయిన్లను అయితే వారి గ్లామర్ తగ్గిందనే నెపంతో పక్కన పెట్టేస్తారు. దీంతో అవకాశాల్లేక క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తారు. కానీ ఓ హీరోయిన్ ఏకంగా 20 ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతున్నారు. మధ్యలో కాస్త గ్యాబ్ ఇచ్చినా నేటికి ఆమె ఫేమస్ నటిగానే గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తెలుగు, తమిళం తో పాటు కన్నడంలోనే తనదైన ముద్ర వేసిన ఈమె తో ఇండస్ట్రీకి […]


Photo story
Photo story: సినిమా ఇండస్ట్రీలో ఎక్కువకాలం రాణించాలంటే సాధ్యం కాని పని. ముఖ్యంగా హీరోయిన్లను అయితే వారి గ్లామర్ తగ్గిందనే నెపంతో పక్కన పెట్టేస్తారు. దీంతో అవకాశాల్లేక క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తారు. కానీ ఓ హీరోయిన్ ఏకంగా 20 ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతున్నారు. మధ్యలో కాస్త గ్యాబ్ ఇచ్చినా నేటికి ఆమె ఫేమస్ నటిగానే గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తెలుగు, తమిళం తో పాటు కన్నడంలోనే తనదైన ముద్ర వేసిన ఈమె తో ఇండస్ట్రీకి వచ్చిన వారు పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ బ్యూటీ మాత్రం ఇండస్ట్రీలో లేటేస్ట్ హీరోయిన్లకు పోటీనిస్తున్నారు. అయితే ఈ స్టార్ నటి చిన్నప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది. ఆమె చిన్నప్పుడు ఎంత ముద్దుగున్నారో.. ఇప్పుడు కూడా అలాగే ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇంతకీ ఎవరామె.
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు ఎప్పటికప్పుడు వస్తుంటారు. కానీ ఆ అందాల నటి మాత్రం 20 ఏళ్లుగా స్టార్ గానే కొనసాగుతున్నారు. ఆ బ్యూటీ ఎవరో కాదు త్రిష. తెలుగులో త్రిష తరుణ్ తో కలిసి ‘నీ మనసు నాకు తెలుసు’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అంతకుముందే తమిళంలో కొన్ని సినిమాల్లో మెరిసిన ఈ భామ తెలుగు సినిమాలతోనే గుర్తింపు సాధించింది. డెబ్యూ మూవీ కాస్త యావరేజ్ గా నడిచినా.. ఆ తరువాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘వర్షం’, ‘సైనికుడు’ తదితర సినిమాలతో ఫేమస్ అయింది.

Trisha
వరుస హిట్లతో దూసుకుపోతున్న త్రిషకు పర్సనల్ లైఫ్ కు సంబందించిన కొన్న విషయాలు డిస్ట్రబ్ చేశాయి. ఓవ్యక్తితో నిశ్చితార్థం జరిగి రద్దయింది. ఆ తరువాత మళ్లీ ఎవర్నీ పెళ్లి చేసుకోలేదు. అయితే మరో వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తోందని ప్రచారం చేస్తున్నా.. అదంతా ఫేక్ అని త్రిష కొట్టి పారేసింది. అయితే త్రిష మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిహీరోయిన్ గానేకొనసాగుతుండడం విశేషం.
ఇటీవల ఆమె నటించిన పొన్నియన్ సెల్వన్, తదితర సినిమాల్లో కనిపించి ఆకట్టుకుంది. ఇలా దాదాపు 20 ఏళ్ల పాటు హీరోయిన్ గానే కొనసాగుతున్న ఈమె అందాన్ని చూసి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త హీరోయిన్లు షాక్ తింటున్నారు. త్రిషతో వచ్చిన కాజల్, తదితర నటులు పెళ్లిళ్లు చేసుకున్నారు.మరికొందరు ఇండస్ట్రీని వదిలి వెళ్లారు. కానీ త్రిష మాత్రం సినిమాల్లో రాణిస్తుండడంతో ఆమె గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు.
