Photo Story: ఈ పాప.. మెగా ఫ్యామిలీ కోడలు.. ఎవరో చెప్పుకోండి?

ఆమె ఎవరో కాదు. ఇటీవల పండండి బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన కొణిదెల. ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరన్ కు భార్య అయిన ఉపాసన.. సినీ ఇండస్ట్రీలో లేకున్నా ఆమె పాపులారిటీ సాధించారు. నిత్యం మెగా ఫ్యాన్స్ తో రామ్ చరణ్ కు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటారు. రామ్ చరణ్ కు సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. అపోలో హాస్పిటల్స్ కు డైరెక్టర్ గా ఉన్న ఆమె ఊరికే కూర్చోలేదు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

  • Written By: Chai Muchhata
  • Published On:
Photo Story: ఈ పాప.. మెగా ఫ్యామిలీ కోడలు.. ఎవరో చెప్పుకోండి?

Photo Story: సినీ ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగుతున్న వారికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. కానీ వారు తమ పర్సనల్ విషయాలను బయటపెట్టరు. ఈ క్రమంలో వారి గురించి తప్ప వారి కుటుంబ విషయాలు బయటపడవు. ముఖ్యంగా గతంలో హీరోలుగా కొనసాగుతున్న వారు తమ సతీమణుల గురించి బయట మాట్లాడేవారు కాదు. దీంతో వారెవరో ఎవరికీ తెలిసేది కాదు. కానీ నేటి కాలంలో సోషల్ మీడియా పుణ్యమాని ప్రతీ ఒక్క విషయం బయటపడిపోతుంది. హీరోలు తమ ఫ్యామిలీ మెంబర్స్ తో సహా సోషల్ మీడియాలోకి వస్తున్నాయి. అలా ఓ హీరో సతీమణి సినీ ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినా సెలబ్రెటీగా మారారు. పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవలు చేస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఆమెకు సంబంధించిన చిన్ననాటి ఓ పిక్ వైరల్ గా మారింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?

ఆమె ఎవరో కాదు. ఇటీవల పండండి బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన కొణిదెల. ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరన్ కు భార్య అయిన ఉపాసన.. సినీ ఇండస్ట్రీలో లేకున్నా ఆమె పాపులారిటీ సాధించారు. నిత్యం మెగా ఫ్యాన్స్ తో రామ్ చరణ్ కు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటారు. రామ్ చరణ్ కు సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. అపోలో హాస్పిటల్స్ కు డైరెక్టర్ గా ఉన్న ఆమె ఊరికే కూర్చోలేదు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

‘యు ఎక్ఛేంజి’ అనే సంస్థ ద్వారా పాత పుస్తకాలను సేకరిస్తున్నారు. వాటిని పేద పిల్లలకు పంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మురికి వాడలో ఉన్న నిరుపేదల పిల్లకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన చికిత్స అందేలా కృషి చేస్తున్నారు. మెగాఫ్యామిలీ కొడలుగా ఉన్న ఆమెకు ఏమాత్రం బ్యాగ్రౌండ్ ను ఉపయోగించుకోవడం లేదు. సాదాసీదాగా కనిపిస్తూ అందరి మనసులు దోచుకున్నారు. ఇక రామ్ చరన్ ను నిత్యం ఆరాధించే తను తనలాంటి భర్తను పొందడం అదృష్టం అని అన్నారు. రామ్ చరణ్ సైతం సతీమణి ఉపాసనపై ఎంతో ప్రేమ ఉన్నట్లు పలు సందర్భాల్లో చెప్పారు.

11 ఏళ్ల తరువాత వీరికి ఇటీవలే ఓ పాప జన్మించింది. ఆమెకు ‘క్లిన్ కారా’ అనే నామకరణం చేసిన విషయం తెలిసిందే. చాలా రోజుల తరువాత తమ ఇంట్లో మహాలక్ష్మి జన్మించిందని చిరంజీవి కుటుంబ సభ్యులతా సంతోషంగా ఉన్నారు. అటు రామ్ చరణ్ ప్రస్తుతం సౌత్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన పిక్స్ ఇటీవలే రిలీజ్ అయి ఆకట్టుకుంటున్నాయి.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు