India Vs Australia 3rd Odi: ఆస్ట్రేలియాతో మూడో వన్డే : టీమిండియాలో కీలక మార్పు
India Vs Australia 3rd Odi: చెన్నై చెపాక్ వేదికగా జరగనున్న మూడో వన్డేలో భారత్ చెలరేగుతుందా. సీరీస్ ను చేజెక్కించుకునే సత్తా చాటుపోతుందా. ఆసీస్ విజయం సాధించి టెస్ట్ ఓటమికి బదులు తీర్చుకుంటుందా.? మూడో వన్డేలో ఎవరు పై చేయి సాధించబోతున్నారో రేపు తేలనుంది. ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో చిత్తుగా ఓడిన టీమిండియా ఆఖరి పోరుకు సిద్ధమైంది. బుధవారం చెన్నైలోని చపాక్ స్టేడియం వేదిక జరగనున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. మూడు వన్డేల […]


India Vs Australia 3rd Odi
India Vs Australia 3rd Odi: చెన్నై చెపాక్ వేదికగా జరగనున్న మూడో వన్డేలో భారత్ చెలరేగుతుందా. సీరీస్ ను చేజెక్కించుకునే సత్తా చాటుపోతుందా. ఆసీస్ విజయం సాధించి టెస్ట్ ఓటమికి బదులు తీర్చుకుంటుందా.? మూడో వన్డేలో ఎవరు పై చేయి సాధించబోతున్నారో రేపు తేలనుంది.
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో చిత్తుగా ఓడిన టీమిండియా ఆఖరి పోరుకు సిద్ధమైంది. బుధవారం చెన్నైలోని చపాక్ స్టేడియం వేదిక జరగనున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. మూడు వన్డేల సిరీస్లో ఇరు జట్లు చేరొక మ్యాచ్లో గెలవడంతో చెన్నై వన్డే ఫైనల్ గా మారింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టునే సిరీస్ వరించనుండడంతో ఇరుజట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ముఖ్యంగా విశాఖ వన్డేలో 10 వికెట్లు తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా.. ఈ ఘోర పరాజయానికి బదులు తీర్చుకోవాలనే ప్రతీకారంతో రగిలిపోతుంది. మరోవైపు రెండో వన్డే విజయంతో ఉత్సాహంగా ఉన్న ఆశిష్ ఇదే జోరులో చివరి మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటోంది. దీంతో చెన్నై వన్డే పై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
మార్పుతో బరిలోకి భారత్..
రెండో మ్యాచ్లో ఊహించని రీతిలో పరాభవాన్ని మూట కొట్టుకున్న భారత్ మూడో వన్డేను విజయంతో ముగించాలని భావిస్తోంది. చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్ కావడం.. చపాక్ స్టేడియం పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో లోకల్ బాయ్ వాషింగ్టన్ సుందర్ ను తుది జట్టులోకి చూసుకునే అవకాశం ఉందన్న చర్చ నడుస్తుంది. అతని ఆడించాలని టీ మేనేజ్మెంట్ భావిస్తే అక్షర పటేల్ పై వేటుపడే అవకాశం ఉంది. ఈ ఒక్క స్థానానికి మించి జట్టులో మార్పులు చేసే అవకాశం లేదు. ఎవరైనా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటే తప్ప జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు అని విశ్లేషకులు చెబుతున్నారు.
సూర్య కుమార్ కు మరో ఛాన్స్..
వరుసగా రెండు వన్డేల్లో విఫలమైన సూర్య కుమార్ యాదవ్ కు.. మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు జట్టులో లేకపోవడంతో ఊరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. కఇషాన్ కిషాన్ ను ఆడించాలనుకుంటే తప్ప సూరి కుమార్ చోటుకు వచ్చే డోకా అయితే లేదు. విశాఖ మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ కూడా సూర్యకుమార్ కు మరో అవకాశం ఇస్తామని హింట్ ఇచ్చాడు. ‘శ్రేయస్ అయ్యర్ ఎప్పుడు పునరాగమనం చేస్తాడో మాకు తెలియదు. కాళీ ఉన్న అతని స్థానంలో సూర్య కుమార్ యాదవ్ ను ఆడిస్తున్నాం. వైట్ బాల్ క్రికెట్ లో అతని సత్తా ఏంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. సత్తా ఉన్న ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తామని ఇప్పటికే నేను ఎన్నోసార్లు చెప్పాను’ అని రోహిత్ తెలిపాడు.

India Vs Australia 3rd Odi
బ్యాటింగ్లో మార్పులు ఉండకపోవచ్చు..
తొలి రెండు వన్డేల్లో దారుణంగా విఫలమైన సుబ్ మన్ గిల్ మూడో వన్డేలోనూ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. రోహిత్ కూడా విశాఖలో విఫలమయ్యాడు. ఇద్దరు మంచి శుభారంభం అందించాల్సిన అవసరం ఉంది. విశాఖలో కాస్త కుదురుకున్నట్లు కనిపించిన విరాట్ కోహ్లీ.. ఇన్ స్వింగ్ డెలివరీకి అవుట్ అయ్యాడు. అతను కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. సూర్య కు ఇది డూ ఆర్ డై మ్యాచ్. తెలివి వన్డేలో జట్టును గెలిపించిన రాహుల్.. మరోసారి అలాంటి ప్రదర్శన చేయాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోను సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఇకపోతే బౌలింగ్ విభాగంలో కూడా పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్ గా కొనసాగుతుండగా.. రవీంద్ర జడేజా, అక్షర పటేల్ ఆల్రౌండర్లుగా కొనసాగనున్నారు. లోకల్ బాయ్ సుందర్ ను ఆడించాలనుకుంటే అక్షర్ బెంచ్ కే పరిమితం అవుతాడు. ప్రధాన పేసర్లు మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగనున్నారు. షమీకి విశ్రాంతి ఇవ్వాలనుకుంటే జయదేవ్ ఉనాధ్కత్, ఇమ్రాన్ మాలిక్ లో ఒకరు జట్టులోకి వస్తారు.
భారత్ తుది జట్టు ( అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), సుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ( వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్/వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ/ఉమ్రాన్ మాలిక్, మహమ్మద్ సిరాజ్.