Pig Thieves: ఆఖరుకు పందులను కూడా వదలరా?

అమిద్యాల గ్రామానికి చెందిన పుల్లమ్మ అనే మహిళ పందులను పెంచుకుంటూ జీవనం సాగిస్తుంది. గ్రామంలోని రహదారి పక్కనే ఈ పందుల దొడ్డి ఉంది.

  • Written By: Raj Shekar
  • Published On:
Pig Thieves: ఆఖరుకు పందులను కూడా వదలరా?

Pig Thieves: దొంగకు చెప్పే లాభం అంటారు. ఈ సామెత తెలంగాణ పల్లెల్లో ఎక్కువ వాడుకలో ఉంటుంది. దొంగతనం చేయాలనుకుంటే చిన్న వస్తువైనా వదలడు అనేది దీని ఉద్దేశం. కొన్ని దొంగతనాలు చూస్తే అది నిజమే అనిపిస్తుంది. తాళం వేసిన ఇళ్లు టార్గెట్‌గా చేసుకుని గుల్ల చేసే దొంగలను చూశాం.. బైకును బయటపెడితే ఎత్తుకెళ్లే దొంగలను చూశాం… అవకాశం వస్తే దేన్ని వదలకుండా బంగారం, డబ్బు, వస్తువులు అందిన కాడికి దోచుకెళ్లే దొంగలనూ ఇప్పటివరకు మనం చూశాం.. అయితే అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాలలో ముసుగు ధరించిన దొంగలు వింత చోరీకి పాల్పడ్డారు. ఎవరు గుర్తు పట్టకుండా ముఖానికి ముసుగు ధరించి వచ్చి పందులను ఎత్తుకెళ్లారు. చెడ్డి గ్యాంగ్‌ తరహాలో ముగ్గురు చెడ్డీలు ధరించి అర్ధరాత్రి గ్రామంలో ప్రవేశించి 30 పందులను ఎత్తుకెళ్లారు.

అన్నీ పెంపకం పందులే..
అమిద్యాల గ్రామానికి చెందిన పుల్లమ్మ అనే మహిళ పందులను పెంచుకుంటూ జీవనం సాగిస్తుంది. గ్రామంలోని రహదారి పక్కనే ఈ పందుల దొడ్డి ఉంది. గురువారం అర్ధరాత్రి సమయంలో ముగ్గురు గుర్తు తెలియని అగంతకులు వచ్చి, ఆ పందులను దొంగిలించారు. బొలేరో వాహనంలో వచ్చిన దుండగులు.. రోడ్డుపైకి ఆ పందులను తొలుకొచ్చారు. ఆపై వాటిని బొలెరో వాహనంలో ఎక్కించి, ఎత్తుకెళ్లారు. దాదాపు 30 పందులను ఎత్తుకెళ్లారని బాధిత మహిళ తెలిపింది. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు గ్రామ శివారులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి.

తెల్లవారి షాక్‌ అయిన పుల్లమ్మ
మరుసటి రోజు ఉదయం పుల్లమ్మ పందుల దొడ్డికి రాగా.. అక్కడ పందులు కనిపించలేదు. దాంతో షాక్‌ అయిన పుల్లమ్మ.. చుట్టుపక్కన వారిని పిలిచి విషయం తెలిపింది. పుల్లమ్మ, గ్రామస్తులంతా కలిసి ఈ చోరీ ఎవరు చేశారా? అని ఆరా తీశారు. ఈ క్రమంలో గ్రామ శివార్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను పరిశీలించారు. అందులో చోరీ చేసిన దృశ్యాలు రికార్డ్‌ అయ్యాయి. కొందరు దొంగలు.. ముఖానికి ముసుగులు వేసుకుని. బొలెరో వాహనంలో వచ్చారు. తమ వాహనాన్ని రోడ్డుపైనే నిలిపిన దొంగలు.. వారు మాత్రం పందుల దొడ్డి వద్దకు వెళ్లారు. అందులోని పందులను బొలెరో వాహనం వద్దకు తరలించారు. ఆపై బొలెరోలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. బొలెరో వాహనం నంంబర్‌ సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యింది. దాని ఆధారంగా బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరా విజువల్స్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వాహనాన్ని ట్రాక్‌ చేసే పనిలో ఉన్నారు.

Read Today's Latest Viral news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు