MS Dhoni : భారత క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోని పేరు తెలియని వారుండరు. వన్డే ప్రపంచ కప్ సాధించిన ఆటగాళ్లలో కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీలు ఇద్దరు కెప్టెన్లు ఉండటం విశేషం. టీ20 ప్రపంచ కప్ సాధించి అందరిలో జోష్ నింపాడు. అంతటి గొప్ప విజయాలు సాధించిన ధోనీని కూడా కెప్టెన్ గా తొలగించేందుకు ప్రయత్నాలు జరిగాయి. టీ20 ప్రపంచ కప్ 2022 టోర్నీలో టీమిండియా పరాజయంతో భారత క్రికెట్ బోర్డులో ప్రక్షాళన జరుగుతోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ల తీరుపై ఆసక్తికర చర్చ సాగుతోంది. దీంతో ధోనీపై కూడా కొన్ని కుట్రలు జరిగినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్థిక్ పాండ్యాకు పగ్గాలు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. దీంతో కెప్టెన్ల తీరుపై చర్చలు వచ్చాయి. టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించిన ధోనీని కూడా ఒక సందర్భంలో తొలగించాలని ప్రయత్నించారు. మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచిన ధోనీని కూడా తప్పించాలని బోర్డు సభ్యులంతా నిర్ణయం తీసుకోవడం విస్మయం కలిగించింది.
ఈ నిర్ణయాన్ని మాజీ సెలెక్టర్ మోహిందర్ అమర్నాథ్ 2011లో వరుసగా సిరీస్ లు ఓడిపోయింది. దీంతో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచుల్లో ధోని సేన చిత్తుగా ఓడింది. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరాజయాలతో ధోనీని కెప్టెన్సీ నుంచి తొలగించాలని సెలక్షన్ కమిటీ తేల్చినా కుదరలేదు. అప్పుడు కృష్ణమాచారి శ్రీకాంత్ చీఫ్ సెలక్టర్ గా ఉన్నారు. దీంతో ధోనీని తీసేయాలన్న వాదనను ఆయన పట్టించుకోలేదు. బోర్డు ప్రెసిడెంట్ గా ఎన్ శ్రీనివాసన్ ఉన్నారు. వారు ధోనీని తీసేయాలనే దానికి వ్యతిరేకంగా ఉండటంతో కుదరలేదు.