Digestion : ఇవి తినడం వల్ల త్వరగా జీర్ణం కావు.. గ్యాస్ ట్రబుల్ సమస్య తప్పదు
మాంసాహారాలు కూడా రోజుల కొద్ది కడుపులోనే జీర్ణం కాకుండా ఉంటాయి. దీంతో గ్యాస్ తేన్పులు రావడంతో వాసన గలీజుగా ఉంటుంది. ఇలా మనకు పడని వాటిని తీసుకుని సమస్యలు తెచ్చుకోవద్దు. త్వరగా జీర్ణమయ్యే వాటిని తీసుకుంటే మంచిది.

Digestion : మనం తినే ఆహారాలు త్వరగా జీర్ణం కాకపోతే అజీర్తి సమస్య ఏర్పడుతుంది. దీంతో గ్యాస్ ట్రబుల్ తలెత్తుతుంది. కడుపు ఉబ్బరం, తేన్పులు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో మనం తేలిగ్గా జీర్ణమయ్యే వాటిని తీసుకోవడం మంచిది. కొన్నింట్లో ప్రొటీన్లు అధికంగా ఉండటంతో అవి కడుపులో త్వరగా జీర్ణం కాక సమస్యలు వస్తాయి. దీంతో మనం తిన్నవి అరగకపోతే తిప్పలు ఎక్కువవుతాయి.
గుడ్లతో..
గుడ్డులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. సల్ఫర్ అధికంగా ఉంటుంది. జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దీంతో గుడ్లు తినడం వల్ల ఆలస్యంగా జీర్ణం అవుతాయి. దీని వల్ల గ్యాస్ సమస్యలు తలెత్తి వాసనతో కూడిన తేన్పులు రావడం సహజం. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే త్వరగా జీర్ణమయ్యే వాటిని తీసుకుంటే మంచిది.
బ్రోక్ లీ
బ్రోక్ లీ కూడా త్వరగా జీర్ణం కాదు. కానీ ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. తొందరగా అరగకపోవడంతో గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. దీని వల్ల పొట్టలో గ్యాస్ సమస్య తలెత్తుతుంది. తేన్పులు వస్తే వాసన కంపుగా ఉంటుంది. ఇంకా ఫ్రై చేసిన పదార్థాలతో గ్యాస్ సమస్య తీవ్రమవుతుంది. కడుపులో గ్యాస్ పేరుకుపోయిన తేన్పులు కంపు వాసన కొడుతుంటాయి.
ముల్లంగి
ముల్లంగి కూడా త్వరగా జీర్ణం కాదు. దీంతో గ్యాస్ సంబంధమైన సమస్యలు రావడం సహజం. ఇలా చాలా పదార్థాలు మనకు తొందరగా జీర్ణం కాకపోవడం వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతాయి. మాంసాహారాలు కూడా రోజుల కొద్ది కడుపులోనే జీర్ణం కాకుండా ఉంటాయి. దీంతో గ్యాస్ తేన్పులు రావడంతో వాసన గలీజుగా ఉంటుంది. ఇలా మనకు పడని వాటిని తీసుకుని సమస్యలు తెచ్చుకోవద్దు. త్వరగా జీర్ణమయ్యే వాటిని తీసుకుంటే మంచిది.
