Good and bad signs: మనం నివసించే ఇంటిని పవిత్రంగా చూసుకుంటాం. ఎలాంటి నష్టాలు రాకుండా ఉండాలని అన్ని రకాల పూజలు చేస్తుంటాం. కానీ కొన్ని ఆచార వ్యవహారాలను మాత్రం వదిలేస్తాం. ఫలితంగా ఇంటికి అరిష్టాలు సోకుతాయి. దీంతో కష్టాలు చుట్టుముడతాయి. తరువాత వాటి నుంచి ఎలా గట్టెక్కాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అందుకే కొన్ని సూచనలు, సంకేతాలు గమనించి వాటిని దూరం చేసుకుంటే సుఖవంతమైన జీవనం సాధ్యమే. ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో కొన్ని సంకేతాలు వివరించాడు. మన ఇంటిని దుష్టశక్తులు చుట్టుముట్టే క్రమంలో మనకు కనిపించే సంకేతాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నాడు.

Chanakya Niti
మానవ జీవితమే సమస్యలమయం. అందుకే వాటి నుంచి దూరం కావడానికి పలు మార్గాలు అన్వేషించాలి. జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి తప్పించుకునేందుకు కొన్ని సూచనలు చేశాడు. మన ఇంట్లో ఉండే తులసి మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. మన సంప్రదాయంలో తులసి మొక్కకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఇది ఎండిపోతే మనకు ఏదో ఉపద్రవం వచ్చే అవకాశముందని తెలుసుకోవాలి. ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రంలో దీనికి సంబంధించిన విషయాలు క్షుణ్ణంగా వివరించాడు. తులసి చెట్టు ఎండిపోతే మనకు కీడు జరిగే ప్రమాదముందని గ్రహించాలి.
Also Read: Gadapa Gadapaku YCP: గడగడపకు వెళితే గట్టి దెబ్బే.. వైసీపీ ప్రజాప్రతినిధులకు చుక్కలు
ఇంకో సంకేతం ఇంట్లో తరచూ గొడవలు జరగడం కూడా పెను ప్రమాదమే. రోజు ఇంట్లో గొడవలు జరిగితే ఆ ఇంట్లో లక్ష్మిదేవి నివసించదు. దీంతో ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ప్రశాంతత కోల్పోవడంతో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ఇది ఇంట్లో జరిగే అనర్థాలకు తార్కాణంగా నిలుస్తోంది. అందుకే ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్త వహించడం మంచిదే.
ఇంకా పెద్దల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం. మన ఇంట్లో ఉండే పెద్దవారిని ఎట్టి పరిస్థితుల్లో నిందించడం, తిట్టడం వంటివి చేయకూడదు. అలా చేస్తే ఆ ఇంట్లో అదృష్ట దేవత ఉండదనే విషయం గ్రహించాలి. పెద్ద వారితో చెడు స్వభావంతో చూడకూడదు. ఇది కూడా మనకు వినాశనం ఎదురవుతుందని తెలుస్తోంది. అందుకే పెద్దలను మర్యాదగా చూసుకుని వారికి ఎలాంటి బాధలు లేకుండా చూసుకుంటే మంచిది.

Chanakya Niti
ఇంట్లో నిత్యం పూజలు చేయకపోతే కూడా అరిష్టమే. మనం నివసించే ఇంట్లో రోజూ పూజలు చేయకపోతే ప్రతికూల వాతావరణం నెలకొంటుంది. దీతో ఆ ఇంట్లో ఉండేవారికి విజయం వరించదు. అనర్థాలు వస్తాయని తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రతి ఇంట్లో రోజు పూజలు చేస్తూ మంచి పరిణామాలు చోటుచేసుకునేలా చేసుకోవచ్చు. ఇలా చాణక్యుడు సూచించిన నియమాలు పాటిస్తూ మనకు శుభాలు జరిగే విధంగా మసలుకోవడం ప్రతి వారికి అవసరమే.
Also Read:Pawan Kalyan: బలంపై జనసేనకు ఫుల్ క్లారిటీ.. వ్యూహం మార్చిన పవన్..