Cricketers Age Difference Wives: పూర్వం వివాహం అనేది ఓ పద్ధతి ప్రకారం చేసేవారు. పదహారు రోజుల పండుగగా జరుపుకునే వారట. రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లుగా పెళ్లి తంతులో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చాలా ఏళ్ల క్రితం ఆడవారి వయసు తక్కువ మగవారి వయసు ఎక్కువగా ఉండేలా చూసుకునే వారు. కానీ ఇటీవల మగవారి వయసు తక్కువగా ఆడవారి వయసు ఎక్కువగా ఉంటోంది. దీంతో దానికి కూడా అందరు తప్పుగా భావించడం లేదు. గతంలో బాల్య వివాహాలు జరిగేవి. చిన్న పిల్లలైన బాలికలకు ఎంతో వయసున్న వారితో పెళ్లిళ్లు చేసేవారు. దీంతో వయసులో తారతమ్యాలు కొట్టొచ్చినట్లుగా కనిపించేవి.

Sachin Tendulkar-Anjali
ప్రస్తుతం పద్ధతులు మారాయి. ఆధునిక నాగరికత ప్రభావంతో జీవితంలో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనకు వస్తున్నారు. దీంతో వయసు తేడాలు భారీగానే ఉంటున్నాయి. అయినా లెక్కచేయడం లేదు. మగవారి కంటే ఆడవారి వయసు కూడా ఎక్కువగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఇదే తరహాలో వివాహాలు చేసుకోవడం తెలుస్తోంది. ఆ మధ్య భార స్టార్ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ తన కంటే ఆరేళ్లు పెద్దదైన అంజలిని వివాహం చేసుకుని అప్పట్లో వార్తల్లో నిలిచారు. రామాయణంలో సీత కూడా రాముడికంటే పెద్దదనే విషయం తెలిసిందే.
Also Read: Viral Video Madhuranagari Song: శ్రీలీలలా దుమ్మురేపిన యువతి.. డ్యాన్స్ వీడియో వైరల్

Irfan Pathan, Safa Baig
భారత క్రికెట్ లో కూడా చాలా మంది క్రికెటర్లు తమకంటే పెద్ద వారిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అదే కోవలో సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, హార్థిక్ పాండ్యా, రాబిన్ ఊతప్ప, విరాట్ కోహ్లి, వెంకటేశ్ ప్రసాద్ లాంటి వారు కూడా తమ కంటే పెద్దవారైన వారినే పెళ్లి చేసుకుని చక్కగా సంసారం చేసుకుంటున్నారు. ప్రేమకు వయసుతో సంబంధం ఉండదని చెబుతున్నారు. ప్రేమతో చూసుకుంటే వయసు అనే తేడాలు ఎక్కడ కూడా కనిపించవు.

virat kohli-anushka sharma
పెళ్లి అనేది ఎన్నో జన్మల సంబంధమే అని నమ్మి తమ భాగస్వామితో కలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తమ కంటే వయసులో పెద్దవారైన వారిని తమ తోడుగా చేసుకుంటున్నారు. వయసులో పెద్దవారైనా తమకు అనుకూలంగా ఉండటంతో వారి ప్రేమ మూడు పువ్వులు ారు కాయలుగా సాగుతోంది. ప్రేమలో ఉంటే ఈ తేడాలు ఏవి కూడా కనిపించవని తెలుస్తోంది. అందుకే అందరు తమకన్నా పెద్దవారైన వారిని జీవితభాగస్వామిగా చేసుకుని ముందుకు పోతున్నట్లు చెబుతున్నారు.
Also Read:Sarkaru Vaari Paata Collections: 111.59 కోట్లు.. ఇది ఒక్క మహేష్ కే సాధ్యం