Safest Cars In India: దేశంలో ఈ కార్లు అత్యంత సేఫ్టీ గా ఉంటాయి.. ఎలాగంటే?

వోక్స్ వాగన్ కంపెనీకి చెందిన ‘విర్టస్’ కారు సురక్షితమైనదిగా టెస్టింగ్ ఏజెన్సీ గ్లోబల్ 5 రేటింగ్ ఇచ్చింది. మిడ్ సైజ్ ఎస్ యూవీ ని కలిగి ఉన్న ఈ మోడల్ రూ.11.48 లక్షల షోరూం ధరతో విక్రయిస్తున్నారు.

  • Written By: SS
  • Published On:
Safest Cars In India: దేశంలో ఈ కార్లు అత్యంత సేఫ్టీ గా ఉంటాయి.. ఎలాగంటే?

Safest Cars In India: ప్రయాణ సాధనాల్లో అన్నింటికంటే కారు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అనుకున్న సమయానికి సుదూరం ప్రయాణం చేయాలనుకునేవారు కారులోనే వెళ్లాలనుకుంటారు. ఆయా బడ్జెట్ కు అనుగుణంగా కారు లేని వారు బుక్ చేసుకుంటారు. మరికొందరు సొంత కారును కొనుగోలు చేస్తారు. అయితే ఇటీవల కారు ప్రమాదాలు మరీ ఎక్కువవుతున్నాయి. ఈ ప్రమాదాల్లో కొన్ని కార్లు పూర్తిగా దెబ్బతిని మనుషుల ప్రాణాలు పోతున్నాయి. మరికొందరికి తీవ్ర గాయాలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ప్రమాదాన్ని తట్టుకునే విధంగా కార్లు డిజైన్ చేశాయి. ఈ కార్లను పరిశీలించిన టెస్టింగ్ ఏజెన్సీ గ్లోబల్ రేటింగ్ కూడా ఇచ్చింది. దీంతో ఈ కార్లను సురక్షితంగా భావించవచ్చు. మరి వాటి గురించి తెలుసుకుందామా..

వోక్స్ వాగన్ కంపెనీకి చెందిన ‘విర్టస్’ కారు సురక్షితమైనదిగా టెస్టింగ్ ఏజెన్సీ గ్లోబల్ 5 రేటింగ్ ఇచ్చింది. మిడ్ సైజ్ ఎస్ యూవీ ని కలిగి ఉన్న ఈ మోడల్ రూ.11.48 లక్షల షోరూం ధరతో విక్రయిస్తున్నారు. ఇందులో ఉన్న ఆరు ఎయిర్ బ్యాగులు ప్రయాణికులను రక్షిస్తాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. మల్టీ కొలిజన్ బ్రేక్స్, టైర్ డిఫ్లేషన్ వార్నింగ్ వంటి ఫీచర్లు ఉండడంతో ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి.

భద్రతను ఇచ్చే మరో కారు స్కోడా స్లోవియా. జర్మనీకి చెందిన స్కోడా కంపెనీ ఈ కారును 2022లో ఆవిష్కరించింది. మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్ లో అత్యంత విశాలమైన కారుగా పేరొందింది. ఇందులో 1.0 TSI 6 ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రలో; కార్నింగ్ కింద మెరుగైన ట్రాక్షన్ కోసం ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ సిస్టమ్, మల్టీ కొలిషన్ బ్రేక్ వంటి భద్రతా ప్రమాణాలను పాటించి డిజైన్ చేశారు. దీనిని రూ.11.39 లక్షలతో విక్రయిస్తున్నారు.

వోక్స్ వాగన్ నుంచి మరో కారు టిగ్వాన్ లోనూ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. 2020లో ఆటో ఎక్స్ ఫోలో ప్రదర్శించిన ఈ కారు ప్రారంభ ధర రూ.33.13 లక్షలతో విక్రయిస్తున్నారు. ఇది కూడా చాలా విశాలమైన కారు. పొడవు 4701ఎంఎం, వెడల్పు 1839 ఎంఎం, 1674 ఎత్తులో ఉంది. వీల్ బేస్ అయితే 2787 ఎంఎంతో ఉంది. రివైజ్డ్ గ్రిల్, సరికొత్త ఎల్ ఈడీ ప్రొజెక్టర్ హెడ్ లైట్లు, ఫ్రంట్ బంపర్ లాంటివి ఎక్స్ ట్రాగా అమర్చారు. 18 అంగుళాల స్పోక్ అల్లాయ్ వీల్స్ కలిగి సేప్టీని కలిగి ఉంది. ఇవే కాకుండా స్కోడా కుషుబ్, మహీంద్రా స్కార్పియో-ఎన్, టాటా పంచ్ లాంటివి కూడా సేప్టీ కార్లుగా భావిస్తున్నారు.

Read Today's Latest Life style News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు