Photo Story: అవార్డు అందుకుంటున్న ఈ చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు స్టార్లు.. ఎవరో తెలుసా?
డైరెక్టర్ రాఘవేంద్రరావు సినిమాలు ఒకప్పడు థియేటర్లలో దద్దరిల్లేవి. ఇండస్ట్రీకి ఆయన ద్వారా ఎంతో మంది పరిచయం అయ్యారు. ఇప్పుడు స్టార్లుగా కొనసాగుతున్నారు. ఇటీవల పెళ్లిసందD అనే సినిమాతో పరిచయం అయిన శ్రీ లీల వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అలాగే ఒకప్పుడు కూడా కూడా ఆయన ఎంతో మంది హీరోలను పరిచయం చేశారు.

Photo Story: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారే. ఒకప్పుడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుల అవసరం ఎక్కువగా ఉండేది. దీంతో స్కూలుకెళ్లే వయసులోనే చాలా మంది ఇండస్ట్రీకి వచ్చి తమ యాక్టింగ్ తో అదరగొట్టారు. ఆ కాలంలోనే వారి నటనకు అవార్డులు కూడా వచ్చాయి. అలనాటి నటుల్లో కొందరు ఇప్పడు హీరో, హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. మరికొందరు మాత్రం అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. తాజాగా ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు మాజీ సీఎం చంద్రబాబునాయుడుతో అవార్డు తీసుకుంటున్న ఓ పిక్ వైరల్ అవుతోంది. ఇందులో ఉన్న బుడ్డోడిని చూస్తే ఎవరో అర్థమవుతుంది. అలాగే ఆ చిన్నారి కూడా ఇటీవలే పాన్ ఇండియా సినిమాలో నటించింది. ఇంతకీ వారెవరో చూద్దాం..
డైరెక్టర్ రాఘవేంద్రరావు సినిమాలు ఒకప్పడు థియేటర్లలో దద్దరిల్లేవి. ఇండస్ట్రీకి ఆయన ద్వారా ఎంతో మంది పరిచయం అయ్యారు. ఇప్పుడు స్టార్లుగా కొనసాగుతున్నారు. ఇటీవల పెళ్లిసందD అనే సినిమాతో పరిచయం అయిన శ్రీ లీల వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అలాగే ఒకప్పుడు కూడా కూడా ఆయన ఎంతో మంది హీరోలను పరిచయం చేశారు. వారిలో అల్లు అర్జున్ ఒకరు. మెగా హీరో అల్లు అర్జున్ 2003లో ‘గంగోత్రి’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అంతకుముందు ఓ సినిమాలో నటించిన బన్నీ గంగోత్రితో స్టార్ అయ్యాడు. ఇందులో ఆయనకు జోడిగా ఆర్తి అగర్వాల్ చెల్లెలు అతిథి అగర్వాల్ నటించారు.
వీరిద్దరికి చైల్డ్ ఆర్టిస్టుగా తేజ సజ్జా, కావ్య నటించారు. వీరు ఆ కాలంలో పాఠశాలలో చదువుతున్నారు. అయితే గంగోత్రి సినిమాకు చైల్డ్ ఆర్టిస్టులు అవసరం కాగా వీరిద్దరికి ఆ అవకాశం వచ్చింది. చైల్డ్ ఆర్టిస్టుగా గంగోత్రి సినిమాలో ఇద్దరూ నటనతో ఆకట్టుకున్నారు. వీరిద్దరి మధ్య ‘వల్లంగి పిట్ట’ అనే సాంగ్ ఇప్పటికీ మారుమోగుతోంది. అయితే వీరి నటనకు మెచ్చిన అప్పటి ప్రభుత్వం అవార్డులను అందజేసింది. ఆ సమయంలో తీసుకున్న పిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
తేజ సజ్జా ‘ఓ బేబీ’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ‘హనుమాన్’ అనే సినిమాలో నటిస్తోంది. అటు కావ్య సైతం ఇటీవల రిలీజైన ‘బలగం’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈసినిమా బంపర్ హిట్టు కావడంతో ఆమెకు గుర్తింపు వచ్చింది. దీంతో ఇద్దరికి మంచి అవకాశాలు వస్తున్నాయనే చెప్పాలి. ఈ సందర్భంగా వారిద్దరి చిన్ననాటి ఫొటోతో నెటిజన్లు సందడి చేస్తున్నారు.
