Heroines Married Politicians: రాజకీయ నాయకులను పెళ్లాడిన టాప్ 5 ఇండియన్ స్టార్ హీరోయిన్లు వీళ్ళే!
బాలీవుడ్ లో హీరోయిన్ గా క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన స్వర బభాస్కర్ ఈమధ్యనే సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఫహద్ జిరార్ మహ్మద్ అనే అతనిని పెళ్లాడింది.

Heroines Married Politicians: సాధారణంగా సినిమా ఇండస్ట్రీ లో పనిచేసే హీరోయిన్లు ఎక్కువగా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలనే పెళ్లి చేసుకోవడం వంటివి చూసాము. ఎందుకంటే ఒకే ఇండస్ట్రీ లో పనిచేస్తారు కాబట్టి, ఒకే లాగ ఆలోచిస్తారు కాబట్టి మనసులు కలిసి ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. కానీ మన ఇండస్ట్రీ కి ఏమాత్రం సంబంధం లేని రాజకీయ నాయకులను, క్రికెట్ స్టార్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు వీళ్లకు పరిచయం ఎలా అయ్యింది, ఎప్పుడు ప్రేమ పుట్టింది, ఇలాంటివి అన్నీ మిస్టరీ గానే ఉంటాయి. అయితే ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీ లో ఉంటూ రాజకీయ నాయకులను పెళ్లాడిన కొంత మంది ఇండియన్ హీరోయిన్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము.
1) రాధికా కుమార స్వామి :
కన్నడ సినీ పరిశ్రమలో రాధికా కి హీరోయిన్ గా ఒకప్పుడు ఉన్న క్రేజ్ మామూలుది కాదు, తెలుగు లో కూడా ఈమె తారకరత్న తో ‘భద్రాద్రి రాముడు’ అనే చిత్రం చేసింది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా కూడా, ఎవరీ అమ్మాయి ఇంత అందంగా ఉంది అని అనుకునేవారు. ఈమె తమిళనాడు ముఖ్యమంత్రి కుమార స్వామి ని ప్రేమించి పెళ్లాడింది. ప్రస్తుతం అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూ, నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.
2) స్వర భాస్కర్ :
బాలీవుడ్ లో హీరోయిన్ గా క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన స్వర బభాస్కర్ ఈమధ్యనే సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఫహద్ జిరార్ మహ్మద్ అనే అతనిని పెళ్లాడింది. వీళ్లిద్దరి పెళ్లి కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియా ట్రోలింగ్స్ కూడా జరిగాయి. ఎందుకంటే గతం లో ఫహద్ జిరార్ ని స్వర బాక్సర్ అన్నయ్య అని పిలిచేది.అన్నయ్య అని పిలిచే వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిగ్గు లేదా అంటూ స్వర భాస్కర్ ని నెటిజెన్స్ ఒక రేంజ్ లో తిట్టే వారు .
3) అయేషా టకియా :
ఈ హాట్ బ్యూటీ అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘సూపర్’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినప్పటికీ అయేషా టకియా కి యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమె బాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈమె 2009 వ సంవత్సరం లో మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు అబూ అసిమ్ అజ్మీ కుమారుడు ఫర్హాన్ అజ్మీని ప్రేమించి పెళ్లాడింది.వీళ్లిద్దరికీ ఒక 9 ఏళ్ళ కుర్రాడు కూడా ఉన్నాడు.
4 ) నవనీత్ కౌర్ :
పరిచయం అక్కర్లేని పేరు ఇది, తెలుగు లో ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె 2011 వ సంవత్సరం లో మహారాష్ట్ర స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసాడు. ఇక నవనీత్ కౌర్ కూడా రాజకీయ నాయకురాలిగా ఎన్నో సార్లు గెలుపొంది చట్ట సభల్లో అడుగుపెట్టింది కూడా.
5 ) పరిణీతి చోప్రా :
రీసెంట్ గా కొద్దిరోజుల క్రితమే పరిణీతి చోప్రా ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ రాఘవ్ చద్దా ని ప్రేమించి నిశ్చితార్థం చేసుకుంది. త్వరలోనే వీళ్లిద్దరి వివాహ మహోత్సవం ధూమ్ ధామ్ గా జరగబోతుంది. పరిణీతి చోప్రా ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా లో చెల్లెలు అవుతుంది ఈమె పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది.
