IPL: 2024 ఐపీఎల్ లో కెప్టెన్లను మార్చనున్న టీములు ఇవే…

కలకత్తా టీం విషయానికి వస్తే ఈ టీం లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ గా ఉన్న విషయం మనకు తెలిసిందే…అయితే ఐపీల్ 2023 సీజన్ లో అయ్యర్ గాయం కారణం గా ఐపీల్ ఆడలేకపోయాడు ఇక దానితో ఈ సీజన్ లో మాత్రం నితీష్ రానా ని కెప్టెన్ గా చేసారు.

  • Written By: Gopi
  • Published On:
IPL: 2024 ఐపీఎల్ లో కెప్టెన్లను మార్చనున్న టీములు ఇవే…

IPL: 2008 లో మొదలైన ఐపీల్ ఇప్పటికి కూడా చాలా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే నిజానికి ఈ ఐపీల్ వల్ల బిసిసిఐ ప్రపంచం లోనే అత్యంత ఎక్కువ డబ్బుని సంపాదిస్తున్న బోర్డు గా చరిత్రలో నిలిచింది.అందుకే ఐపీల్ మీద ఎంత మంది ఎన్ని కామెంట్లు చేసిన కూడా ఐపీల్ నుంచి వచ్చే ఇన్ కమ్ ఎక్కువ గా ఉండటం వల్ల బిసిసిఐ ఇప్పటికి ఐపీల్ ని నడిపిస్తూనే ఉంది.ఇక ఇందులో పాల్గొనే జట్లు కూడా ప్రతి సంవత్సరం వాళ్ల టీంలో మార్పులు, చేర్పులు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి…ఇక దానికి తోడు ఈ టీంలు కూడా చాలా మంది ప్లేయర్లని ఆక్షన్ లో తీసుకొని వాళ్ళతో మ్యాచులు ఆడిస్తూ టీం విజయం లో కీలక పాత్ర వహిస్తున్నాయి…అయితే ఐపీల్ లో టైటిల్ గెలిచినా టీములకి మాత్రమే జనాల్లో కేజ్ ఎక్కువగా ఉంటుంది…ఐపీల్ 2023 సీజన్ కు గాను చెన్నై సూపర్ కింగ్స్ టీం కప్పు గెలవడం జరిగింది…ఇక ఐపీల్ 2024 కోసం అన్నిజట్లు ఇప్పటినుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

ఇక గత సీజన్ లో ఫెయిల్ అయినా అన్ని జట్లు కూడా ప్రస్తుతం వాళ్ల టీం లో ఉన్న మైనస్ పాయింట్స్ ని, ప్లస్ పాయింట్లు గా మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాయి…అందుకు గాను కొన్ని టీములు వాళ్ల కెప్టెన్లని మార్చే ప్రయత్నం లో ఉన్నాయి అనే విషయం మనకు స్పష్టం గా తెలుస్తుంది…అవి ఏ టీములు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

ముందుగా పంజాబ్ టీం గురించి కనక చూసుకుంటే ఈ టీం ఐపీల్ 2023 లో భారీగా ప్లాప్ అయినా విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే ఈ టీం లో కెప్టెన్ గా ఉన్న శిఖర్ ధావన్ తన టీం ని ముందు ఉండి నడిపించడం లో చాలా వరకు ఫెయిల్ అయ్యారు అనే చెప్పాలి.ప్రత్యర్థి జట్లు తీసుకునే నిర్ణయాల ముందు శిఖర్ ధావన్ తీసుకున్న నిర్ణయాలు అంత పెద్ద ప్రభావం చూపించలేకపోయాయి…ఈ ఇయర్ ధావన్ తన బ్యాటింగ్ తో కూడా పెద్ద మ్యాజిక్ చేయలేకపోయాడు.ఇక దానితో పంజాబ్ యాజమాన్యం శిఖర్ ధావన్ ని తీసివేసి ఆయన ప్లేస్ లో మరో కొత్త కెప్టెన్ ని తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు గా తెలుస్తుంది…ప్రస్తుతం ఆ టీం లో కెప్టెన్ గా చేసే ప్లేయర్లు ఎవరు లేకపోవడం తో వేరే ప్లేయర్ ని తీసుకోవాలని చూస్తుంది…

ఇక కలకత్తా టీం విషయానికి వస్తే ఈ టీం లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ గా ఉన్న విషయం మనకు తెలిసిందే…అయితే ఐపీల్ 2023 సీజన్ లో అయ్యర్ గాయం కారణం గా ఐపీల్ ఆడలేకపోయాడు ఇక దానితో ఈ సీజన్ లో మాత్రం నితీష్ రానా ని కెప్టెన్ గా చేసారు.ఈయన సారధ్యం లో ఆడిన కలకత్తా టీం ఈ సీజన్ లో మాత్రం అంత మంచి ప్రదర్శన అయితే ఇవ్వలేదు ఇక దానితో 2024 సీజన్ లో మళ్లి శ్రేయాస్ అయ్యర్ ని కెప్టెన్ గా చేస్తారు అనే విషయం అయితే మనకు అర్థం అవుతుంది…

ఇక మనం చేప్పుకోబోయే మరో టీం సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ టీం విషయానికి వస్తే ఈ టీం లో ఇప్పటికే చాలా మంది కెప్టెన్ లు గా చేసారు.అందులో ముఖ్యంగా కెన్ విలియం సన్,డేవిడ్ వార్నర్ లు ముఖ్యులు అనే చెప్పాలి.ఇక వీళ్ల తర్వాత ఈ టీం కి కెప్టెన్ గా భువనేశ్వర్ కుమార్ కూడా చేసాడు.ఇక ఈయన తరువాత 2023 సీజన్ లో ఏడయిన్ మార్కరం కెప్టెన్ గా చేసాడు…అయితే ఈయన టీం కి అనుకున్నట్టుగా విజయాల్ని అందించలేకపోయాడు కనీసం టీం ని సెమి ఫైనల్స్ కి కూడా చేర్చలేకపోయాడు కాబట్టి కెప్టెన్ గా ఈయన్ని తీసివేసి ఈయన ప్లేస్ లోకి ఒక కొత్త కెప్టెన్ ని తీసుకువచ్చే ప్లానింగ్ లో హైదరాబాద్ టీం యాజమాన్యం ఉన్నట్టు గా తెలుస్తుంది…

ఇక ఢిల్లీ టీం విషయానికి వస్తే ఢిల్లీ టీం కి ఫుల్ టైం కెప్టెన్ గా రిషబ్ పంత్ ఉన్నప్పటికీ ఆయనకి కారు ప్రమాదం జరగడం తో ఈ ఏడాది జరిగిన ఐపీల్ కి అందుబాటు లో లేడు దానితో ఆయన ప్లేస్ లోకి కెప్టెన్ గా వార్నర్ వచ్చాడు. వార్నర్ కెప్టెన్సీ లో ఢిల్లి టీం చాలా దారుణమైన పరిస్థితి ని ఎదురుకుంటూ దారుణంగా ఓడిపోయింది.ఇక దానికి తగ్గట్టు గానే ఈ టీం పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానం లో ఉంది.ఇక దానితో 2024 సీజన్ లో ఈ టీం కి మళ్లి రిషబ్ పంత్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

ఇక లక్నో టీం విషయానికి వస్తే ఈ టీం లో మంచి ప్లేయర్లు ఉన్నప్పటికీ ఈ టీం మాత్రం కప్పు కొట్టలేకపోతుంది. ఆడిన రెండు సీజన్లలో కూడా ప్లే ఆఫ్ కి చేరుకున్న ఈ టీం ఎందుకు ఫైనల్ కి వెళ్లలేకపోతుందో ఎవరికీ తెలీడం లేదు అయితే ఈ టీం కూడా కెప్టెన్ ని మార్చాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది…అయితే రెండు సీజన్లలో కూడా ఈ టీం కి రాహుల్ కెప్టెన్ గా ఉన్న విషయం మనకు తెలిసిందే ఐపీల్ 2023 చివర్లో ఆయనకి గాయం అవ్వడం వల్ల మిగిలిన మ్యాచ్ లు ఆడకుండా దూరం అయిపోయాడు…దింతో ఈ టీం ప్లే ఆఫ్ లో ఓడిపోవాల్సి వచ్చింది.అయితే రాహుల్ మీద ఆ టీం యాజమాన్యం పూర్తి నమ్మకం తో ఉన్నట్లు గా అయితే కనిపించడం లేదు. ఆ ఉద్దేశ్యం తోనే ఈయన్ని పక్కన పెట్టబోతున్నట్టు గా తెలుస్తుంది…

చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే ఈ టీం లో ఇప్పటికే ధోని రిటైర్ మెంట్ ప్రకటించే టైం దగ్గరికి రావడం తో ఈ టీం కొత్త కెప్టెన్ ని నియమించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది…దానికోసం ఇప్పటికే ఋతురాజ్ గైక్వాడ్ ని రంగంలోకి దింపినట్టు గా తెలుస్తుంది. ప్రస్తుతం ధోని 2024 ఐపీల్ సీజన్ ఆడిన కూడా నెక్స్ట్ సీజన్ కి అయితే అందుబాటు లో ఉండడు. కాబట్టి ఐపీల్ 2024 లోనే ధోని ఆడిన కూడా గైక్వాడ్ ని కెప్టెన్ గా చేసి ధోని సజెషన్స్ తో గైక్వాడ్ కి శిక్షణ ని ఇస్తూ ఈ సీజన్ లో గైక్వాడ్ తోనే కెప్టెన్సీ చేయించాలని చూస్తున్నారు…ఇంతకు ముందు కూడా రవీంద్ర జడేజా ని ఇలా టెస్ట్ చేసారు అయినా కూడా ఆయన అనుకున్న విజయాలను అందుకోకపోవడం తో మళ్లి ధోనీనే కెప్టెన్ గా వ్యవహరించాల్సి వచ్చింది…

Read Today's Latest Sports news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు