Multistarrer films: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీనే కాదు, అటు నార్త్ ఇండస్ట్రీలోనూ మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ మొదలైంది. అయితే, నిజానికి మల్టీస్టారర్ సినిమాలు చాలా వరకు బాగుండవు. అందుకు కారణాలు చాలా ఉన్నాయి. మల్టీ స్టారర్ అనే అంశాన్ని పక్కన పెడితే.. ఒక్కో హీరోకి ఒక్కో శైలి ఉంటుంది. కాబట్టి.. మల్టీస్టారర్ కథలో చాలా అంశాలను జోడించాలి.
దీనికితోడు వంశపారపర్యంగా ఉన్న బడా హీరోల ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది. కథ వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి. సవరణ లేని క్షణం ఆ కథ తిరస్కరణ తథ్యం. అయినా మంచి కథలకి ప్రోత్సాహం లేనప్పుడు సినిమాలు ప్లాప్ లే అవుతాయి. మరోపక్క పెద్ద దర్శకుల ఆధిపత్యం, పైత్యం కూడా కథలు చెడిపోవడానికి ఒక కారణం.
అలాగే కమర్షియల్ గా మాత్రమే అలోచించే కళా పోషకులు కూడా మల్టీస్టారర్ సినిమాలకు పెద్ద అడ్డంకి. అలాగే ప్రేక్షకులు కూడా మల్టీస్టారర్ అనగానే ఆ సినిమా పై ఆశలు అంచనాలు ఎక్కువగా పెట్టేసుకుంటారు. ఒక విధంగా అభిమానుల వేలం వెర్రి కూడా ఒక్కోసారి మంచి సినిమాలను చంపేస్తోంది. అప్పట్లో బాలయ్య బాబు సుల్తాన్ అనే మల్టీస్టారర్ వచ్చింది.
నిజానికి నిజమైన మల్టీస్టారర్ అంటే అదే. ఆ సినిమా ఎందుకో పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. మళ్లీ ఆ సినిమా తర్వాత ఆ రేంజ్ మల్టీస్టారర్ అంటే ఆర్ఆర్ఆర్ సినిమానే. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా అవుట్ ఫుట్ కూడా బాగుంది అంటున్నారు. కాబట్టి.. ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే, భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి.. సినిమా ఏ మాత్రం నచ్చకపోయినా సినిమాకి నెగిటివ్ టాక్ ఎక్కువైపోతోంది.