Most Subscribed Youtube Channels 2022: ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ అనేది ఒక నిత్యావసరమైపోయింది.. దాని ఆధారంగానే అన్ని పనులు జరిగిపోతున్నాయి. యాప్స్ మన గమనాన్ని నిర్దేశిస్తున్నాయి. అయితే అలాంటి వాటిలో ముందు వరుసలో ఉండేది యూ ట్యూబ్. ఏ ముహూర్తాన అయితే దీనిని కనిపెట్టారో కానీ అప్రతి హతంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో యూట్యూబ్ అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది.. అందులో మొదటిది వ్యక్తిగత ఛానల్. ప్రస్తుతం ఈ వ్యక్తిగత ఛానళ్ళ ద్వారా కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. భారతదేశంలో ప్రతి 5 వేల మందిలో ఇద్దరికీ యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయని ఒక అంచనా.. ఇక అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. ఆదాయం భారీగా ఉండడంతో చాలామంది ఛానళ్ళు ఏర్పాటు చేసి దండిగా ఆదాయాన్ని పొందుతున్నారు . కంటెంట్ క్రియేటర్లుగా మారి భారీగా వెనకేసుకుంటున్నారు. భారత్ లాంటి దేశాల జీడీపీకి యూట్యూబ్ ఏటా 6,800 కోట్లు ఇస్తోంది.. 5 కోట్ల మంది యూట్యూబ్ ఆధారంగా ఉపాధి పొందుతున్నారు. వీరిలో ఒక్కొక్కరు నెలకు పాతికవేల నుంచి కోటి రూపాయల దాకా ఆదాయం పొందుతున్నారు.

Most Subscribed Youtube Channels 2022
ఈ ఛానళ్ళ దే హవా
యూట్యూబ్ అనగానే ఇప్పుడు అందరికీ చానల్స్ మాత్రమే గుర్తుకు వస్తాయి.. అయితే ప్రతి రంగంలోనూ పోటీ ఉన్నట్టు… యూట్యూబ్లోనూ పోటీ ఉంది.. సబ్స్క్రైబర్ల ఆధారంగా చానల్స్ స్థాయి ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ జాబితాలో ముందు వరుసలో ఉండేది టి సిరీస్. ఈ ఛానల్ కి 230 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు.. కూ మీలన్ నర్సరీ రైమ్స్ అనే ఛానల్ కు 148 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. సెట్ ఇండియా అనే ఛానల్ కు 147 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. మిస్టర్ బీస్ట్ అనే ఛానల్ కి 114 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ప్యూ డయి పయి అనే ఛానల్ కి 111 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. కిడ్స్ డయానా షో అనే చానెల్ కు 104 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు.. లైక్ నాస్తయా అనే ఛానల్ కు 102 మిలియన్ల సబ్ స్క్రైబర్లు ఉన్నారు.
క్రియేటర్లకు డిమాండ్ పెరుగుతోంది
యూట్యూబ్ విస్తరిస్తున్న కొద్ది కంటెంట్ క్రియేటర్లకు డిమాండ్ భారీగా పెరుగుతున్నది.. ప్రస్తుతం భారతదేశంలో కంటెంట్ క్రియేటర్ల వ్యవస్థ విలువ 3,300 కోట్లకు చేరువలో ఉంది.. అది మరో నాలుగు సంవత్సరాలకు 33 వేల కోట్లకు కాగలదని ఒక అంచనా. అందుకే యూట్యూబ్ ఆధారంగా పనిచేసే స్టార్టప్ కంపెనీలకు ఈ సంవత్సరం 16 వేల కోట్ల దాకా పెట్టుబడులు వచ్చాయి. 2021 లో కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పటికీ ఈ సంస్థల్లోకి 75% ఫండింగ్ పెరగడం అంటే మామూలు విషయం కాదు. ఇక 2020లో భారతదేశ జీడిపికి యూట్యూబ్ క్రియేటర్ వ్యవస్థ 6,800 కోట్ల రూపాయలను జమ చేసింది..

Most Subscribed Youtube Channels 2022
ఆదాయం ఇలా వస్తుంది
చానళ్ళకు సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు అంటే వాటిల్లో సృజనాత్మకత ఎక్కువ ఉన్న క్రియేటర్లు ఉన్నారని అర్థం.. ఇంకా వీటిని నాలుగు విభాగాలుగా యూట్యూబ్ విభజించింది.
*నానో: 1000 నుంచి 10,000 మంది వరకు ఫాలోవర్స్ ఉంటారు..ఒక్కో.పోస్ట్ కు 4,000 దాకా సంపాదించవచ్చు.
* మైక్రో: ఫాలోవర్లు పదివేల నుంచి లక్ష దాకా ఉంటారు.. ఆదాయం 40,000 నుంచి 60,000 దాకా వస్తుంది.
మాక్రో: లక్ష నుంచి పది లక్షల దాకా ఫాలోవర్స్ ఉంటారు.. లక్షన్నర నుంచి మూడున్నర లక్షల దాకా ఆదాయం పొందుతారు.
మెగా: ఫాలోవర్స్ సంఖ్య 10 లక్షల పైన ఉంటుంది. ఆదాయం నాలుగు లక్షల దాకా వస్తుంది..
ఇక యూట్యూబ్ ఛానల్స్ విషయానికి వస్తే టి సిరీస్ నెంబర్ వన్ పొజిషన్లో ఉంది కాబట్టి… ఆదాయం కోట్లల్లో ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే యూట్యూబ్ అనేది ఇప్పుడు ఆటవిడుపు కాదు.. కాలక్షేపం అంత కన్నా కాదు.. ఆదాయాన్ని సంపాదించిపెట్టే ఒక డిజిటల్ మార్గం.