Sleeping Problems: నిద్ర రావడం లేదా? కారణాలివే..

ప్రస్తుతం అందరు ఫోన్లకు అలవాటు పడిపోయారు. తెల్లవారింది మొదలు పడుకునే వరకు ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. దీంతో కళ్ల మీద ప్రభావం పడుతోంది. అర్థరాత్రి వరకు ఫోన్ చూస్తే నిద్ర మీద కూడా ప్రభావం పడి నిద్ర కరువవుతోంది. ఈ విషయం వారికి ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. ఫలితంగా నిద్ర సమస్య వెంటాడుతోంది. సమయానికి నిద్ర పోకపోతే చాలా నష్టాలు వస్తాయి.

  • Written By: Srinivas
  • Published On:
Sleeping Problems: నిద్ర రావడం లేదా? కారణాలివే..

Sleeping Problems: మనిషికి తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. అందుకే రోజుకు కనీసం 7-9 గంటలు నిద్రపోవాల్సిందే. నిద్రలో మన అవయవాలు అన్ని సర్దుకుంటాయి. వాటి మరమ్మతులు అవిచేసుకుంటాయి. దీంతో మరునాడు ఫ్రెష్ గా ఉండేందుకు కారణమవుతుంది. అదే మనం సరిగా నిద్రపోలేకపోతే మన అవయవాలు సరిగా పనిచేయవు. నిద్రలో మనకు చాలా లాభాలుంటాయి. మన మెదడు కూడా రిలాక్స్ గా ఉంటుంది. ఎలాంటి ఆలోచనలు లేకుండా సేద తీరుతుంది. దీంతో ఉదయం లేవగానే మంచి ఆలోచనలతో నిండిపోతోంది.

నిద్ర ఎందుకు రావడం లేదు

ప్రస్తుతం అందరు ఫోన్లకు అలవాటు పడిపోయారు. తెల్లవారింది మొదలు పడుకునే వరకు ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. దీంతో కళ్ల మీద ప్రభావం పడుతోంది. అర్థరాత్రి వరకు ఫోన్ చూస్తే నిద్ర మీద కూడా ప్రభావం పడి నిద్ర కరువవుతోంది. ఈ విషయం వారికి ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. ఫలితంగా నిద్ర సమస్య వెంటాడుతోంది. సమయానికి నిద్ర పోకపోతే చాలా నష్టాలు వస్తాయి.

వాతావరణ ప్రభావం

మనకు సరైన నిద్ర పట్టడానికి వాతావరణ ప్రభావం కూడా ఉంటుంది. ఎండాకాలంలో ఉక్కపోతకు సరిగా నిద్రపట్టదు. వర్షాకాలం, చలికాలంలో అయితే నిద్ర బాగా పడుతుంది. కానీ ఎండాకాలంలో నిద్ర పట్టక ఇబ్బందులు పడుతుంటాం. దీనికి కూడా అనుకూల మార్పులుంటాయి. కూలర్ వేసుకుంటే నిద్ర సరిగా పడుతుంది. నిద్ర సమస్య అసలే ఉండదు.

పడక గది

పడక గది కూడా సరిగా ఉండాలి. వెలుతురు లేకుండా చీకటి ఉండేలా చూసుకుంటే నిద్ర బాగా పడుతుంది. గదిలో వెలుతురు ఉంటే సరిగా నిద్ర రాదు. నిద్రలేమితో చాలా సమస్యలొస్తాయి. అందుకే మంచి నిద్ర పోవడానికే మొగ్గు చూపాలి. పగటి పూట ఎక్కువ సేపు నిద్ర పోకూడదు. మధ్యాహ్నం ఎక్కువ సమయం పడుకుంటే రాత్రి సరిగా నిద్ర పట్టక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

Read Today's Latest Health news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube