200 Crore Club Telugu Movies: ఒకప్పుడు మన తెలుగు సినిమా వంద కోట్ల రూపాయిల గ్రాస్ కొడితే అద్భుతంగా భావించేవారు.. బాహుబలి వచ్చిన తర్వాత వంద కోట్ల రూపాయిల గ్రాస్ అనేది చాలా చిన్న విషయం అయిపోయింది.. స్టార్ హీరోల ఫ్లాప్ సినిమాలకు కూడా అవలీలగా వంద కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చేస్తుంది.. ఆ రేంజ్ కి మన మార్కెట్ ఎదిగింది.. ఇప్పుడు టాలీవుడ్ సినిమా మార్కెట్ వెయ్యి కోట్ల రూపాయిలను చూసింది.. స్టార్ హీరో మామూలు హిట్ సినిమాకి కూడా రెండు వందల కోట్ల రూపాయిలను వసూలు చేసే రోజులవి.. అయితే రీసెంట్ ఇయర్స్ లో విడుదలైన తెలుగు సినిమాలలో రాజమౌళి సినిమాలు కాకుండా 200 కోట్ల రూపాయిలు గ్రాస్ ని సాధించిన టాప్ 5 సినిమాలేంటో చూద్దాము.

200 Crore Club Telugu Movies
1 ) అలా వైకుంఠపురంలో :
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అలా వైకుంఠపురంలో’ చిత్రం 2020వ సంవత్సరంలో విడుదలై ఎలాంటి సంచలన విజయం సాధించింది.. ఈ సినిమాకి 152 కోట్ల రూపాయిల షేర్ , 250 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

Ala Vaikunthapurramuloo
2 ) సైరా నరసింహా రెడ్డి :
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ పీరియాడికల్ చిత్రం అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. ఇతర భాషలలో ఆశించిన స్థాయి విజయం సాధించలేదు కానీ , తెలుగు లో మాత్రం భారీ హిట్..సుమారు గా 240 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని సాధించిన ఈ చిత్రానికి దాదాపుగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

Sye Raa Narasimha Reddy
3) సరిలేరు నీకెవ్వరూ :
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా అలా వైకుంఠపురంలో చిత్రంతో పోటీగా దిగింది.. ఆ సినిమాతో పాటుగా ఈ చిత్రం కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. సుమారుగా 235 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి 130 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

Sarileru Neekevvaru
4)రంగస్థలం :
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో మైలు రాయిగా నిల్చిన ఈ చిత్రానికి 216 కోట్ల రూపాయిల గ్రాస్ , 123 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.. ఆరోజుల్లో బాహుబలి సిరీస్ తర్వాత 200 కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరిన మొట్టమొదటి సినిమా ఇదే.

Rangasthalam
5) వాల్తేరు వీరయ్య:
200 కోట్ల రూపాయిల క్లబ్ లోకి రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చిన చిత్రమిది.. మెగాస్టార్ చిరంజీవి చాలాకాలం తర్వాత మాస్ కమర్షియల్ మూవీ చెయ్యడంతో అభిమానులు మరియు ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.. ఈ నెల 13వ తారీఖున విడుదలైన ఈ సినిమాకి కేవలం పది రోజుల్లోనే 200 కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరింది.. రాబోయే రోజుల్లో ఈ చిత్రం 300 కోట్ల రూపాయిల క్లబ్ లో చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు ట్రేడ్ పండితులు.

Waltair Veerayya
ఈ టాప్ 5 చిత్రాలు టాలీవుడ్ లో 200 కోట్ల క్లబ్ లో చేరాయి.. ఇందులో నాలుగు సినిమాలు మెగా హీరోలవే ఉండడం విశేషం. పైగా రెండు సినిమాలు సైరా, వాల్తేరు వీరయ్య మూవీలు చిరంజీవి చేసినవి కావడం గమనార్హం. మంచి సినిమాలు పడాలే కానీ చిరంజీవి బాక్స్ బద్దలు కొట్టేస్తాడన దానికి ఇదే నిదర్శనం