Mileage Cars: SUV ల్లో అత్యధిక మైలేజ్ ఇచ్చే డీజిల్ కార్లు ఇవే..
దక్షిణ కొరియా కంపెనీ కారు కియా భారత్ లో దూసుకుపోతుంది. డీజిల్ ఎస్ యూవీల్లో ఇదొకటి. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ తో పాటు 115 బీహెచ్ పీ, 250 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్దుంది. ఈ కారు లీటర్ కు 24.1 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది.

Mileage Cars: భారత్ లో ఎస్ యూవీల కోసం చాలా మంది కార్ల వినయోగదారులు ఎగబడుతున్నారు. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఎస్ యూవీలనే ఉత్పత్తి చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే సాధారణంగా ఎస్ యూవీ కావాలనుకునేవారు పెట్రోల్ వెహికిల్స్ కంటే డీజిల్ వాహనాలు కొనడం బెటరని కొందరు ఆటో మోబైల్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇవి భారీ ఇంజన్ తో కూడుకొని ఎక్కువ మైలేజ్ ఇస్తుంటాయి. అలా ఎక్కువ మైలేజ్ ఇచ్చే వెహికిల్స్ ఏవో చూద్దాం..
దక్షిణ కొరియా కంపెనీ కారు కియా భారత్ లో దూసుకుపోతుంది. డీజిల్ ఎస్ యూవీల్లో ఇదొకటి. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ తో పాటు 115 బీహెచ్ పీ, 250 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్దుంది. ఈ కారు లీటర్ కు 24.1 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కంపెనీ నుంచి వచ్చిన థార్ వంటి వాహనాలు అత్యధికంగా ప్రాచుర్యం పొందారు. ఇందులో భాగంగా XUV 300 అత్యధిక మైలేజ్ ఇస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ తో పాటు 117 బీహెచ్ పీ పవర్, 300 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటర్ కు 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
భారత్ లో ఇతర కార్లతో హ్యుందాయ్ పోటీ పడుతోంది. ఈ కంపెనీ నుంచి వెన్యూ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ తో పాటు 115 బీహెచ్ పీ వపర్, 250 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 23.4 మైలేజ్ ఇస్తుంది. టాటా నెక్సాన్ సైతం ఎస్ యూవీ లతో పోటీపడుతోంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ తో పాటు 260 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పాటు ఆటో మేటిక్ వేరియంట్ 24.07 మైలేజ్ ఇస్తుంది.
ఎస్ యూవీల్లో అత్యధిక మైలేజ్ ఇచ్చే వాహనాల్లో ఇవి ప్రసిద్ధి చెందాయి. నేటి కాలంలో చాలా మంది హ్యాచ్ బ్యాక్ కంటే ఎస్ యూవీలకే ప్రిపరెన్స్ ఇస్తున్నారు. పెట్రోల్ వేరియంట్ లోనూ ఎస్ యూవీలు మార్కెట్లో తిరుగుతున్నాయి. అయితే అత్యధిక మైలేజ్ కోసం చూసేవారికి ఈ కార్లు బెస్ట్ అని అంటున్నారు.
