Budget Smartphones 2023: 15 వేల లోపు లభించే బ్రాండెడ్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే..

ఐక్యూ జడ్ 6 దేశీయంగా ఉత్పత్తి అయింది. 5జీ నెట్ వర్క్ సపోర్టు తోపనిచేసే ఈ మొబైల్ 6.58 ఇంచెస్ ఎల్ సీడీ డిస్ ప్లే విత్ 120 హెర్ట్ రీఫ్రెష్ రేట్ సపోర్లు తో పనిచేస్తుంది. డ్యూయెల్ కెమెరా సెటప్ తో లావా బ్లేజ్ 5 జీలో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా , 2 ఎంపీ డెప్త్ సెన్షర్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ను యూజ్ చేసుకోవచ్చు. 4 జీబీ ర్యామ్ తో పాటు 64 స్టోరేజీని కలిగి ఉంది. 5000 ఎంహెచ్ బ్యాటరీ తో 18W చార్జింగ్ అవుతుంది. దీని ధర రూ.13,999.

  • Written By: SS
  • Published On:
Budget Smartphones 2023: 15 వేల లోపు లభించే బ్రాండెడ్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే..

Budget Smartphones 2023: నేటి కాలంలో మొబైల్ లేని చేతులు కనిపించవు. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళల వరకు ప్రతి ఒక్కరూ మొబైల్ తో తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. కొందరు కాలక్షేపం కోసం ఫోన్ ను వాడుతుండగా..మరికొందరు వృత్తి పరంగా ఈ గాడ్డెట్ ను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడుంతా స్మార్ట్ పోన్లే చలామణి అవుతున్నాయి. డబ్బా ఫోన్ పూర్తిగా కనుమరుగైపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా లేటేస్టుగా 5G మొబైల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఆకట్టుకునే ఫీచర్స్, ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ సర్వీస్ ను అందించే ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. మొన్నటి వరకు వీటి ధరలు అధికంగానే ఉన్నాయి. కానీ కొన్ని కంపెనీలు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా తక్కువ ధరలకు అందించే విధంగా ఉత్పత్తి చేశాయి. ఆ ఫోన్ల వివరాలు తెలుసుకుందాం..

లావా బ్లేజ్ 5జీ:
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ లావా నుంచి రిలీజైన బ్లేజ్ 5జీ ఆకట్టుకుంటోంది. 4జీబీ ర్యామ్, 128 స్టోరేజి ఉన్న ఇది 6.5 ఇంచెస్ ఎల్సీడీ విత్ హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. ఈ మొబైల్ స్క్రీన్ 90 హెర్డ్ రిఫ్రెస్ రేట్ కు సపోర్టుగా ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని కలిగి ఉన్న ఈ మొబైల్ ధర కేవలం రూ.10,999 మాత్రమే.

శాంసంగ్ గెలాక్సీ M13 5జి:
శాంసంగ్ గెలాక్సీ M13ని కూడా 5 జి నెట్ వర్క్ తో రిలీజ్ చేశారు. తక్కువ బడ్జెట్ లో బ్రాండ్ మొబైల్ ను పొందాలంటే ఇది బెస్ట్ అప్షన్ అని అంటున్నారు. 6.6 ఇంచెస్ ఎఫ్ హెచ్ డీ క్వాలిటీని కలిగి ఉన్న ఇందులో 6 జీబీ ర్యామ్ ఉండగా.. 128 జీబీ స్టోరేజ్ చేసుకోవచ్చు. 50 ఎంపీ రెగ్యులర్ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరాను యూజ్ చేసుకోవచ్చు. 6000 ఎంహెచ్ బ్యాటరీతో 15 W చార్జింగ్ అయ్యే ఈ మొబైల్ ను కేవలం రూ.12,999తో సొంతం చేసుకోవచ్చు.

IQoo జెడ్6 లైట్ 5G:
ఐక్యూ జడ్ 6 దేశీయంగా ఉత్పత్తి అయింది. 5జీ నెట్ వర్క్ సపోర్టు తోపనిచేసే ఈ మొబైల్ 6.58 ఇంచెస్ ఎల్ సీడీ డిస్ ప్లే విత్ 120 హెర్ట్ రీఫ్రెష్ రేట్ సపోర్లు తో పనిచేస్తుంది. డ్యూయెల్ కెమెరా సెటప్ తో లావా బ్లేజ్ 5 జీలో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా , 2 ఎంపీ డెప్త్ సెన్షర్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ను యూజ్ చేసుకోవచ్చు. 4 జీబీ ర్యామ్ తో పాటు 64 స్టోరేజీని కలిగి ఉంది. 5000 ఎంహెచ్ బ్యాటరీ తో 18W చార్జింగ్ అవుతుంది. దీని ధర రూ.13,999.

రెడ్ మీ11 ప్రైమ్ 5జీ:
స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు Redmi 11 5జీ ఆకట్టుకుంటుంది. దీనిని 2022 సెప్టెంబర్ లో లాంచ్ చేశారు. ఈ మొబైల్ రెండు కలర్లలో అందుబాటులో ఉంటోంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉన్న ఈ మొబైల్ 6.58 ఇంచెస్ ఎఫ్ హెచ్ డి డిస్ ప్లే, 4 జీబీ ర్యామ్ తో పాటు 64 జీబీ స్టోరేజ్ ఉంది. రెగ్యులర్ కెమెరా 50 ఎంపీ, ఫ్రంట్ కెమెరా 8 ఎంపీ తో కూడుకొని ఉంది. ఇందులో క్రికెట్ ను చూస్తే అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. దీని ధర రూ.13,999.

శాంసంగ్ గెలాక్సీ M14 5జి:
SAMSUNG కంపెనీ నుంచి రిలీజైన న్యూ మోడల్ గెలాక్సీ M14 5జి ఆకట్టుకుంటోంది. సౌత్ కొరియాలో ఉత్పత్తి అయినా ఈ మొబైల్ గెరిల్లా గ్లాస్ ను కలిగి ఉంది. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో 25 W చార్జింగ్ అవుతుంది. 6.6 ఇంచెస్ హెచ్ డి డిస్ ప్లే తో కూడిని ఈ మొబైల్ లో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ను కలిగి ఉంది. కెమెరా విషయానికొస్తే 50 ఎంపీ, 2 ఎంపీ, 2 ఎంపీ.. ఫ్రంట్ 13 మెగా పిక్స్ తో కూడుకొని ఉంది. ఆండ్రాయిడ్ 13 వన్ యూఐ క్రోర్ 5.1 ను కలిగి ఉంది. దీనిని రూ.14,990తో విక్రయిస్తున్నారు.

సంబంధిత వార్తలు