Actresses Who Played Prostitutes: ఈ రోజుల్లో హీరోయిన్స్ కి వైవిధ్యమైన పాత్రలు చేసే అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. స్టార్ హీరోల సినిమాల్లో గ్లామర్ రోల్స్ తోనే హీరోయిన్స్ కెరీర్ ముగిసిపోతుంది. తమను తాము నిరూపించుకునే అవకాశం రావడం కష్టం. అదే సమయంలో కొన్ని పాత్రలు చేయాలంటే గట్స్ ఉండాలి. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనే తెగింపు ఉండాలి. అలాంటి పాత్రల్లో వేశ్య ఒకటి. వేశ్యగా నటించేందుకు హీరోయిన్స్ జంకుతారు. కారణం ఏదైనా తేడాపడితే అసలుకే ఎసరొస్తుంది. కెరీర్ గల్లంతు కావచ్చు.

Actresses Who Played Prostitutes
అందులోనూ వేశ్య అంటే మితిమీరిన శృంగార సన్నివేశాల్లో నటించాల్సి రావచ్చు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వద్దు బాబోయ్ అంటారు. అయితే కొందరు స్టార్ లేడీస్ ఈ సవాల్ స్వీకరించారు. వెండితెర వేశ్యలుగా అలరించారు. వారు ఎవరో చూద్దాం… క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్,మనోజ్ హీరోలుగా తెరకెక్కిన వేదం చిత్రంలో అనుష్క వేశ్య రోల్ చేశారు. ఆమె పాత్ర కొంచెం బోల్డ్ గానే సాగుతుంది.
దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ జ్యోతిలక్ష్మీ. ఛార్మి హీరోయిన్. ఈ చిత్రంలో ఛార్మి వేశ్య పాత్ర చేశారు. సినిమా మాత్రం పెద్దగా ఆడలేదు. వేశ్య పాత్ర చేసిన మరో స్టార్ హీరోయిన్ శ్రియ శరన్. పవిత్ర మూవీలో శ్రియ వేశ్యగా పెద్ద సాహసమే చేశారు. ఖడ్గం మూవీతో హీరోయిన్ సంగీత టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ బొద్దుగుమ్మ తమిళ చిత్రం ధనం లో వేశ్య రోల్ చేశారు.
సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కెరీర్లో పలు విలక్షణ పాత్రలు చేశారు. వాటిలో వేశ్య రోల్ కూడా ఉంది. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ పంచతంత్రం మూవీలో రమ్యకృష్ణ వేశ్యగా నటించి అలరించారు. హోమ్లీ హీరోయిన్ స్నేహ వేశ్యగా చేయడం నిజంగా సంచలనం. కెరీర్ ఫేడ్ అవుట్ అవుతున్న దశలో ఆమె ఇలాంటి బోల్డ్ రోల్ చేశారు. ధూల్ పేట్ మూవీలో స్నేహ వేశ్యగా కనిపించారు.

Actresses Who Played Prostitutes
వేశ్య పాత్ర చేసిన మరో స్టార్ హీరోయిన్ శృతి హాసన్. బాలీవుడ్ చిత్రం ‘డి డే’లో శృతి పాకిస్థాన్ కి చెందిన వేశ్యగా నటించారు. 90లలో దేవత పాత్రలకు ప్రేమ కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలిచారు. అయితే కెరీర్ బిగినింగ్ లో ఆమె వేశ్య రోల్ చేయడం కొసమెరుపు. ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన ‘ఉపేంద్ర’ చిత్రంలో ప్రేమ ఒక సన్నివేశంలో వేశ్యగా చేశారు.
70-80లలో స్టార్స్ గా వెలిగిన జయసుధ ప్రేమాభిషేకం మూవీలో, జయప్రద మేఘ సందేశం చిత్రంలో వేశ్యలుగా నటించారు. తెలుగు అమ్మాయిలు కూడా తగ్గలేదు. అంజలి, బింధు మాధవి తమిళ చిత్రాల్లో వేశ్య పాత్రలు చేయడం విశేషం.