T20 World Cup: 2024 టీ20 ప్రపంచకప్ డేట్స్ ఇవే.. 10 వేదికలు.. ఈసారి అమెరికాలో.. భారత్, పాక్ మ్యాచ్ ఎక్కడంటే?
క్రికెట్ వెస్టిండీస్ సీఈవో జానీ గ్రేవ్ మాట్లాడుతూ ‘చరిత్రలో అతిపెద్ద ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఆమోదించబడిన వేదికలను మేము ప్రకటించినందున ఆనందంగా ఉంది.

T20 World Cup: వచ్చే ఏడాది జరిగే ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌కు కరేబియల్ దీవులు వేదిక కానున్నాయి. 2024, జూన్ 3 నుంచి 30 వరకు ఈ టోర్నీ జరుగనుంది. ఏడు దేశాల్లో ఏడు వేదికలను ఎంపిక చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఆంటిగ్వా – బార్బుడా, బార్బడోస్, డొమినికా, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, టినిడాడ్ – టొబాగోతోపాటు అమెరికాలోని డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్‌లో టోర్నీ నిర్వహిస్తామని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డిస్ తెలిపారు. ‘20 జట్లు ట్రోఫీ కోసం పోటీపడుతున్న అతిపెద్ద ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చే ఏడు కరేబియన్ వేదికలను ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాం. ఈవెంట్‌కు అద్భుతమైన బ్యాక్‌డ్రాప్‌ను అందించే ఆటగాళ్లు, అభిమానులతో అన్నీ ప్రసిద్ధ వేదికలు. ఇది వెస్టిండీస్ హోస్ట్ చేసే మూడో ఐసీసీ సిరీస్. మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు కరేబియన్‌లో క్రికెట్‌ను ఆస్వాదించే ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తాయి. మా క్రీడకు నిరంతర నిబద్ధత, మద్దతు కోసం నేను క్రికెట్ వెస్టిండీస్‌తోపాటు ఏడు దేశాల ప్రభుత్వాలకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను’ అని వివరించారు.
మా ఆతిథ్యం ఆనందంగా ఉంది..
క్రికెట్ వెస్టిండీస్ సీఈవో జానీ గ్రేవ్ మాట్లాడుతూ ‘చరిత్రలో అతిపెద్ద ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఆమోదించబడిన వేదికలను మేము ప్రకటించినందున ఆనందంగా ఉంది. ఇది ఒక ఉత్తేజకరమైన క్షణం, వచ్చే ఏడాది జూన్‌లో 20 జట్లు 55 మ్యాచ్‌ల్లో ఆడుతున్నాయి. ఒక తరం కోసం మా ప్రాంతంలో నిర్వహించబడుతున్న అత్యంత ముఖ్యమైన క్రీడా ఈవెంట్‌ను హోస్ట్ చేయడం సంతోషంగా ఉంది. కరేబియన్‌లోని అతి«థ్య ప్రభుత్వాలకు కృతజ్ఞతలు’ అని తెలిపారు. ‘ఈ ప్రాంతం మా ప్రత్యేక సంస్కృతి మరియు కార్నివాల్ వాతావరణంతో అందించే అత్యుత్తమమైన ప్రపంచ స్థాయి టోర్నమెంట్‌ను అందజేస్తామని విశ్వసిస్తున్నాం. ఇది వచ్చే జూన్‌లో క్రీడల నిజమైన వేడుకను నిర్వహించేలా చేస్తుంది’ అని వెల్లడించారు.
భారత్, పాక్ మ్యాచ్ ఎక్కడంటే?
ఇక టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా–పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఐసెన్ హోవర్ పార్క్‌లో జరిగే అవకాశం ఉంది. ఇది న్యూయార్క్ నగరానికి 30 మైళ్ల దూరంలో ఉంది. ఇక 2024 టీ20 ప్రపంచ కప్‌లో మొత్తం 20 జట్లు ఆడనున్నాయి. ఈ 20 జట్లను 5 జట్లు చొప్పున 4 గ్రూపులుగా విభజించనున్నారు. అన్ని గ్రూపుల్లోని టాప్–2 జట్లు.. సూపర్–8 రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. ఆ తరువాత 8 జట్లను 4 చొప్పున 2 గ్రూపులుగా విభజిస్తారు. రెండు గ్రూపుల్లోని టాప్–2 జట్లు సెమీఫైనల్ కు అర్హత సాధిస్తాయి.
