Star Directors: స్టార్ డైరెక్టర్లలో నెలకొన్ని పోటీ.. ఇంతకీ ఎవరు టాప్?
ఈ ఇద్దరు డైరెక్టర్లు కూడా టాప్ డైరెక్టర్లే.. దానికి తగ్గట్టే వీరి సినిమాలుంటాయి. ఈ ఇద్దరు కూడా గతంలో డైరెక్టర్స్ శంకర్, మణిరత్నం ఎలాగైతే ఫ్లాప్ లు లేకుండా సినిమాలు చేసి టాప్ పొజిషన్ లో ఉన్నారో.. వీరు కూడా ఒక్క ఫ్లాప్ లేకుండా అదే రేంజ్ లో హిట్ టాక్ లను సొంతం చేసుకున్నారు.

Star Directors: లోకేష్ కనకరాజు, అట్లీ ఈ ఇద్దరు డైరెక్టర్ల పేరు తమిళ ఇండస్ట్రీలో మారుమోగుతుంటుంది. వీరిద్దరు ఇండస్ట్రీలో తమదైన మార్క్ వేసుకున్నారు. అంతేకాదు ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన గుర్తింపును సాధించారు. ఈ రేంజ్ నే కంటిన్యూ చేస్తూ.. ఇద్దరు కూడా 5 సినిమాలు చేశారు. కానీ ఒక్కరు కూడా ఒక్క ఫ్లాప్ ను చవిచూడలేదు. ఇద్దరు కూడా హిట్ లతోనే దూసుకొని వెళ్లారు. ఇక తమిళ ఇండస్ట్రీ మొత్తం వీరి సినిమాల గురించే పెద్ద చర్చ నడుస్తుంటుంది. మరి ఈ ఇద్దరిలో ఎవరు గ్రేట్ అనే ప్రశ్న మీలో ఎప్పుడైనా కలిగిందా? కానీ ఈ ఇద్దరి ఫ్యాన్స్ మాత్రం ఇదే డైలమాలో ఉన్నారట. ఇంతకీ ఎవరు గ్రేట్ అనే విషయం ఓ సారి చూసేద్దాం…
ఈ ఇద్దరు డైరెక్టర్లు కూడా టాప్ డైరెక్టర్లే.. దానికి తగ్గట్టే వీరి సినిమాలుంటాయి. ఈ ఇద్దరు కూడా గతంలో డైరెక్టర్స్ శంకర్, మణిరత్నం ఎలాగైతే ఫ్లాప్ లు లేకుండా సినిమాలు చేసి టాప్ పొజిషన్ లో ఉన్నారో.. వీరు కూడా ఒక్క ఫ్లాప్ లేకుండా అదే రేంజ్ లో హిట్ టాక్ లను సొంతం చేసుకున్నారు. ఇక లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వచ్చిన ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాయి. ఇదిలా ఉంటే అట్లీ తీసిన సినిమాల్లో రాజా రాణి, పోలీసోడు, అదిరింది, జవాన్ వంటి సినిమాలు కూడా అదే రేంజ్ లో హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.
ఇద్దరి ట్రాక్ ఒకే రేంజ్ లో ఉండడంతో ఈ ఇద్దరిలో టాప్ ఎవరు అనేది చెప్పడం కష్టమే. అయితే తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా సినిమాలు చేస్తూ దూసుకొనిపోతున్నారు ఈ ఇద్దరు డైరెక్టర్లు. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా దూసుకొని పోతున్న ఈ ఇద్దరిలో ఒక్క ఫ్లాప్ ను చవిచూస్తే.. వారు కాస్త డల్ అని చెప్పవచ్చు. కానీ ఇప్పటికీ అలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకోలేదు కాబట్టి ఇద్దరు గ్రేట్ అంటున్నారు నెటిజన్లు. మరి చూడాలి ముందు ముందు తీసే సినిమాలు ఎలా ఉంటాయో…
