CM Jagan : ట్విట్ చేసే తీరిక లేదా జగనన్నా?
ఆఫ్ లైన్ లో తండ్రి .. వైసీపీని దున్నేస్తున్నారని సొంత పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నారు. అధినేత జగన్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాగైతే కష్టమని వ్యాఖ్యానిస్తున్నారు. అధినేత తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు.

CM Jagan : సీఎం జగన్ నాలుగేళ్ల తన మార్కు పాలన పూర్తిచేసుకున్నారు. ప్రజలకు బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందిస్తున్నానన్న ధీమా, వచ్చే ఎన్నికల్లో సునాయాసంగా గెలిచేస్తానన్న అతి ధీమా జగన్ లో స్పష్టంగా కనిపిస్తోంది. అటు వైసీపీ శ్రేణులు సైతం అదే భావనతో సంబరాలు చేసుకుంటున్నాయి. అనుకూల మీడియా పతాక శీర్షికలతో అడ్వర్టైజ్ మెంట్స్ తో హోరెత్తిస్తోంది. అయితే ఈ సందడిలో తనను గెలిపిస్తారన్న ఏపీ ప్రజలు జగన్ కు కనిపించకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. కనీసం ఒక ట్విట్ చేసి ప్రజలతో తన ఆనందాన్ని పంచుకునే తీరిక లేని స్థితిలో జగన్ ఉండడం ఓకింత చర్చనీయాంశంగా మారింది.
అయితే ఏపీ ప్రజలు తన కట్టుబానిసలు అనుకున్నారో ఏమోకానీ తన తరుపున తన మంత్రదండం సజ్సల వారు స్పందించారు. విచిత్రం ఏమిటంటే అసలు తానే పరిపాలిస్తున్నట్లుగా.. ప్రభుత్వం గురించి.. ప్రభుత్వ పథకాల గురించి.. పరిపాలనా తీరు గురించి సజ్జల విచ్చలవిడిగా ఇంటర్యూలు ఇచ్చేశారు. ఇతర చానళ్లకు..మీడియాకు ఇవ్వలేదు. తమకు అనుబంధ మీడియాకే ఇచ్చారు. వాటిని ప్రైమ్ టైమ్ లో ప్రసారం చేసుకుంటారు. అయితే ఇవి చూసిన వారికి అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు అనే సందేహం రాక మానదు. ఆయన కేవలం ఓ సలహాదారు మాత్రమే. కానీ సీఎం ఆయన చేతిలో మంత్రదండం పెట్టినంతగా చెలరేగిపోయారు.
అక్కడితే సజ్జల వారు ఆగారా? అంటే అదీ లేదు. ఆయన కుమారుడు రంగంలోకి దిగిపోయాడు. సీఎం తరపున సోషల్ మీడియా చూసే నెట్‌వర్క్ వుంటుంది కదా? అది కూడా మన సజ్జల కుమారుడు లీడ్ చేస్తున్నదే. నాలుగేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడం, అలాగే మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైఎస్ జగన్ మీడియా ముందుకొచ్చి మాట్లాడి వుంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కూడా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చి, నాలుగేళ్ల పాలనపై అభిప్రాయాలు పంచుకోవడం ఏంటనే విమర్శ వెల్లువెత్తుతోంది.
ఆఫ్ లైన్‌లో సజ్జల ఓవరాక్షన్ ఒక వైపు.. ఆన్ లైన్ లో ఆయన కుమారుడి రియాక్షన్ ఒక వైపు వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ గా ఉన్న ఆయన జగన్ పాలనా విజయాల ప్రచారం కన్నా. తన తండ్రి అన్న మాటలు.. తన ఫోటోలను హైప్ చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఆన్ లైన్ లో కొడుకు.. ఆఫ్ లైన్ లో తండ్రి .. వైసీపీని దున్నేస్తున్నారని సొంత పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నారు. అధినేత జగన్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాగైతే కష్టమని వ్యాఖ్యానిస్తున్నారు. అధినేత తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు.
