TRS MLAs Purchase Case- KCR: మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఏదో చేయాలి అనుకుంటున్న కెసిఆర్ కు ఏదీ అచ్చి రావడం లేదు.. అసలు ఈ కేసు ప్రారంభంలోనే ఏసీబీ కోర్టు రాష్ట్ర పోలీసులకు తలంటింది. ” కొంచెం కూడా ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇలా ఎలా చేస్తారంటూ” ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తలవంచుకోవడం రాష్ట్ర పోలీసులవంతయింది. తర్వాత ఈ కేసులో భారతీయ జనతా పార్టీ అగ్ర నేతలను ఇరికించాలనే తలంపుతో కేసీఆర్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఆ దర్యాప్తు బృందం కూడా కెసిఆర్ ట్యూన్ లోనే పనిచేసింది. చేస్తూనే ఉంది. బిజెపి అగ్ర నాయకుడు బిఎల్ సంతోష్ కు నోటీసు ఇచ్చింది.. విచారణకు రావాలని కోరింది. ఇదేదో తనను అరెస్టు చేసే పన్నాగం అనుకొని బిఎల్ సంతోష్ ముందుగానే కోర్టుకు వెళ్లారు. కోర్టు వెంటనే స్టే విధించింది.

TRS MLAs Purchase Case- KCR
అంతకు ముందు ఏం జరిగిందంటే
ఈ కేసుకు సంబంధించి పలు ఆధారాలను పోలీస్ శాఖ కంటే ముందే కేసీఆర్ మీడియా ప్రతినిధులకు విడుదల చేశారు. ప్రగతి భవన్ లో మూడు దఫాలుగా ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత కేంద్రాన్ని ఎండగట్టడమే పనిగా పెట్టుకున్నారు. మీడియా సంస్థలకు లీకులు కూడా ఇచ్చారు. ఇదే సమయంలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ద్వారా సీల్డ్ కవర్లో కొన్ని సీడీలు, పెన్ డ్రైవ్ పెట్టి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపారు.. బహుశా ఇలా చేయడం దేశ చరిత్రలో మొదటిసారి. ఈ తీరుతో నొచ్చుకున్న రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ను పిలిచి ” ఇవి ఎక్కడ పెట్టుకోవాలి” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో అడ్వకేట్ జనరల్ క్షమాపణలు చెప్పారు. అప్పటినుంచి ఈ వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వం తీరుపై ఆగ్రహంగా ఉంది.
అమిత్ షా ను టార్గెట్ చేయబోయి..
నిన్నా మొన్నటి వరకు బీ ఎల్ సంతోష్ ను కార్నర్ చేశామని భుజాలు తడుముకున్న కేసీఆర్ కు ఇవాళ ఏసీబీ కోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. పోలీసులు దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టి వేసింది. తెలంగాణ ప్రభుత్వానికి ఊహించిన దెబ్బ తగిలింది. ఈ కేసులో బిజెపి అగ్ర నేత బిఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామి, శ్రీనివాస్ లను నిందితులుగా చేర్చి ఏసీబీ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన ఏసిబి కోర్టు ప్రత్యేక తీర్పు వెలువరించింది. ఈ కేసులో పీసీ యాక్ట్ అనుసరించి సంఘటన స్థలంలో డబ్బు దొరకలేదని, మెమో లో పేర్కొన్న నిందితులు అక్కడ లేరని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. సంఘటనా స్థలంలో లేని వారిని నిందితులుగా చేర్చడం ఏంటని ప్రశ్నించింది. దీంతో మెమోను కొట్టివేసింది.

KCR
ఇప్పుడు ఏమి చేయవలే
ఏసీబీ కోర్టు నుంచి అనుకోని దెబ్బతో టిఆర్ఎస్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఇప్పటికే నిందితులకు బెయిల్ వచ్చింది. కానీ కోర్టు విధించిన పూచీకత్తు చెల్లించలేక వారు మూడు రోజుల పాటు కస్టడీ లోనే ఉన్నారు. తాము బెయిల్ పూచీకత్తు చెల్లించే పరిస్థితి లో లేము..ఇక ఎమ్మెల్యేల బేరసారాలు ఎలా చేస్తామని చెప్పకనే చెప్పారు. ఇదే విషయం ఈరోజు ఏసీబీ కోర్టులో ప్రస్తావనకు వచ్చింది. వరుసగా కోర్టు నుంచి ఎదురు దెబ్బలు తగులుతూ ఉండడంతో టిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యంగా కెసిఆర్ చేస్తున్న అతి మరోసారి తెరపైకి వచ్చింది. మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.