KCR: కేంద్ర ఎన్నికల సంఘం విధించిన నిబంధనలతో రాజకీయ పార్టీలు పరిమితులకు లోబడి ఉంటున్నాయి. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నికలో గులాబీ పార్టీ ప్రచార సభ నిర్వహించుకోలేకపోయింది. ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేయడంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. దీంతో రాజకీయ పార్టీల ఆగడాలు సాగకుండా చేయడంలో సఫలం అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడంలో విజయం సాధించినట్లు చెబుతున్నారు.
టీఆర్ఎస్ పార్టీ ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేటలో సీఎం కేసీఆర్ తో బహిరంగ సభ నిర్వహించాలని అనుకున్నా కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలతో వీలు కాలేదు. దీంతో అర్థంతరంగా సభ రద్దు చేసుకున్నారు. తరువాత సీఎం రోడ్ షో పెట్టాలని భావించినా అది కూడా సాధ్యం కాలేదు. ఈసీ సూచనతో పొరుగు జిల్లాల్లో కూడా సభలు నిర్వహించొద్దని చెప్పడంతో సీఎం సభ నిర్వహణ సాధ్యం కాలేదు.
ఎన్నికల కోడ్ తో పార్టీలు తలకిందులవుతున్నాయి. ప్రచారం హోరెత్తించాలని భావించినా ఈసీ కొరడాతో సైలెంట్ అయిపోయాయి. మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా టీఆర్ఎస్ మాత్రం అధినేత ప్రచారంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ కాలం కలిసిరాక సభ రద్దు కావడంతో ఇక చేసేదేమీ లేదని మథనపడిపోతున్నారు. కేసీఆర్ సభ ఉంటే జనం హోరెత్తి ఓట్లు గంప గుత్తగా రాలేవని ఆ పార్టీ అభిప్రాయం.
ఈ నేపథ్యంలో ఈసీ నిబంధనలు బాగానే పనిచేస్తున్నాయి. రాజకీయ పార్టీల హంగామాకు అడ్డకట్ట వేస్తున్నాయి. ప్రజలను ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశాలకు చెక్ పెడుతున్నాయి. దీంతో పార్టీల నేతలు ఇంటింటి ప్రచారానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఓట్లు సంపాదించుకోవాలని తాతపత్రయ పడుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రచారం జోరు పెంచాలని భావిస్తున్నాయి.
Also Read: Jagan: తాడేపల్లి నుంచే చంద్రబాబును జగన్ కంట్రోల్ చేస్తున్నారా?