Pakistan : పాకిస్థాన్‌లో ఇంకా డీజిల్ ఇంజిన్ రైళ్లే.. కరెంటు ఇంజిన్ కానరాదు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..!
అప్పట్లో ఈ ఎలక్ట్రిక్ ట్రైన్‌లో ఉండే కాపర్ వైర్లను దొంగలించడం మొదలుపెట్టారు. దీంతో ఆ ఇంజిన్లకే పాకిస్థాన్ బ్రేక్ వేసింది.

Pakistan : టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. రోజు రోజుకు ఎన్నో మార్పులు వస్తున్నాయి. ల్యాండ్ ఫోన్ నుండి మొబైల్ ఫోన్ వరకు.. మర పడవల నుంచి మోటార్లతో నడిచే ఓడల వరకు.. డీజిల్ ట్రైన్ల నుంచి ఎలక్ట్రికల్ ట్రైన్ల వరకు.. ఇలా టెక్నాలజీ ద్వారా మనం అభివృద్ధి చెందుతూనే ఉన్నాం. టెక్నాలజీతో చాలా పనులు ఎంతో సులభంగా అయిపోతున్నాయి. ఇదివరకు రోజుల్లో ఎంతో కష్టపడితే కానీ పూర్తికానివి ఇప్పుడు సాంకేతికతతో సులభంగా చేసేస్తున్నాం. ఎన్నో కొత్త కొత్త పరికరాలు రోజు రోజుకీ వస్తున్నాయి. ఇక స్మార్ట్ ఫోన్‌తో ప్రతిదీ ఈజీ అయిపోయింది. చిన్న చిన్న దేశాలు కూడా టెక్నాలజీ సాయంతో అడ్వాన్స్‌డ్‌గా ఉంటే… మన దాయాది దేశం పాకిస్థాన్ మాత్రం రైళ్లకు ఇంకా డీజిల్ ఇంజన్లనే ఉపయోగిస్తోంది. ప్రపంచ దేశాల్లో ఎలక్ట్రిక్, మాగ్నటిక్ రైళ్లు బుల్లెట్‌లా దూసుకుపోతుంటే పాకిస్థాన్ మాత్రం డీజిల్ ఇంజిన్ రైళ్లతోనే నెట్టుకొస్తోంది. అలా ఎందుకు చేస్తుందో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు.
