Naga Chaitanya: రెండో పెళ్లి లేదు… ఆ హీరోయిన్ తో సహజీవనం ప్రకటించనున్న నాగ చైతన్య?
అయితే శోభిత దూళిపాళ్లతో ఆయన రిలేషన్ కన్ఫర్మ్ చేసినట్లు మైండ్ బ్లాక్ చేసే న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఏడాది కాలంగా శోభిత ధూళిపాళ్ల- నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నారనే వాదన గట్టిగా వినిపిస్తుంది.

Naga Chaitanya: హీరో నాగ చైతన్య అనూహ్య నిర్ణయం తీసుకోనున్నారనే ప్రచారం గట్టిగా సాగుతుంది. ఈ మేరకు నేషనల్ మీడియాలో వచ్చిన ఓ కథనం టాలీవుడ్ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. నాగ చైతన్య రెండో పెళ్ళికి సిద్ధం అవుతున్నారని కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతో తెలుసుకునేందుకు ఓ నేషనల్ మీడియా చైతూ సన్నిహితులను సంప్రదించారట. వారిచ్చిన సమాచారం మేరకు నాగ చైతన్య సెకండ్ మ్యారేజ్ కి సిద్ధం అవుతున్నారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదట.
అయితే శోభిత దూళిపాళ్లతో ఆయన రిలేషన్ కన్ఫర్మ్ చేసినట్లు మైండ్ బ్లాక్ చేసే న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఏడాది కాలంగా శోభిత ధూళిపాళ్ల- నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నారనే వాదన గట్టిగా వినిపిస్తుంది. ఇందుకు కొన్ని ఆధారాలు లభించాయి. విదేశాల్లో జంటగా వీరు కెమెరా కంటికి చిక్కారు. నాగ చైతన్య- శోభిత లండన్ లోని ఓ ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్లారు.
సదరు రెస్టారెంట్ చెఫ్ నాగ చైతన్యతో సెల్ఫీ దిగాడు. సదరు సెల్ఫీ ఆయన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. అనూహ్యంగా సదరు సెల్ఫీలో శోభిత దూరంగా క్యాప్చర్ అయ్యింది. ఆ ఫోటో సంచలనం రేపింది. వరుస కథనాలు వెలువడటంతో సదరు చెఫ్ ఇంస్టాగ్రామ్ నుండి ఆ పోస్ట్ డిలీట్ చేశాడు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇక నాగ చైతన్య సన్నిహితుల తాజా సమాచారం ప్రకారం… శోభితతో తన రిలేషన్ బహిర్గతం చేయనున్నాడని అంటున్నారు. వారిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉన్నారట.
అదే జరిగితే టాలీవుడ్ హీరోల్లో ఎవరూ చేయని సాహసం అవుతుంది. చాలా మంది హీరోలు చాటు మాటుగా వ్యవహారాలు నడిపారు కానీ ఇలా ప్రకటించిన దాఖలాలు లేవు. మరోవైపు నాగ చైతన్య వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన గత రెండు చిత్రాలు థాంక్యూ, కస్టడీ పరాజయం పొందాయి. అందుకే భారీ హిట్ తో కమ్ బ్యాక్ కావాలని అనుకుంటున్నాడు. దూత టైటిల్ తో నాగ చైతన్య ఓ సీరిస్ చేశాడు. అది ప్రైమ్ లో స్ట్రీమ్ కావాల్సి ఉంది.
