Pawan Kalyan- NTR: ఆయన కాషాయం ధరించిన ఓ సమ్మోహనశక్తి. చేనేత వస్త్రాన్ని ధరించిన ఓ రాజకీయశక్తి. పైకి కనిపించని ఓ సంప్రదాయవాది. తెలుగు నేల పై మార్పు కోసం పరితపించే ప్రజాశక్తి. అభాగ్యులకు, అన్నార్తులకు అండగా ఉండేందుకు వారాహి పై ప్రయాణమయ్యారు. అవినీతి పై ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ఆయనే జనసేనాని పవన్ కళ్యాణ్.

Pawan Kalyan- NTR
చాలా మంది రాజకీయ నాయకులు, సినీ తారలు గొప్ప సంప్రదాయవాదుల్లా కనిపిస్తారు. సినిమా, రాజకీయ కార్యక్రమాల ప్రారంభానికి శుభముహుర్తాలు, శకునాలను బలంగా విశ్వసిస్తారు. కానీ జనసేనాని పవన్ కల్యాణ్ పైకి సంప్రదాయవాదిలా కనిపించరు. ఓ మోడ్రన్ పర్సనాలిటీలా కనిపిస్తారు. పైకి విశ్వాసాలు లేని వ్యక్తిలా కనిపిస్తారు. కానీ ఆయనో గొప్ప సంప్రదాయవాది అన్న విషయం చాలా మందికి తెలియదు. సంప్రదాయాన్ని పాటిస్తారు. అదే సమయంలో మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తారు. ఏ నమ్మకమైన మానవ అభ్యున్నతికి పాటుపడేలా ఉండాలని నమ్ముతారు.
పవన్ కళ్యాణ్ ముఖ్యమైన సందర్భాల్లో యాగాలు, పూజలు నిర్వహించడం నమ్ముతారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కోసం పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ఆధ్యాత్మిక గురువు రాజశ్యామల యాగం చేస్తున్నారని తెలుస్తోంది. ఆ గురువు సూచన మేరకే తెలుగు రాష్ట్రాల్లోని 32 నారసింహ క్షేత్రాల పర్యటనకు దశలవారీగా వెళ్తున్నట్టు తెలుస్తోంది.
జనసేనానిది కులాలను, మతాలను కలిపే రాజకీయ విధానం. అంతేకానీ తాను నమ్మేది అందరూ నమ్మాలని కోరుకునే వ్యక్తిత్వం కాదు. అందరి పై తన నమ్మకాన్ని రుద్దే సంప్రదాయం జనసేనానిది కాదు. తప్పు ఎక్కడ జరిగినా ప్రశ్నిస్తారు. దేవాలయాలను విగ్రహాలను కూల్చినా.. మసీదు, చర్చిలకు ఇబ్బంది కల్గించినా ఒకే విధంగా ప్రశ్నించే గొప్ప తత్వం. ఏ మతమైనా, ఏ సిద్ధాంతమైనా మనుషులకు మంచి చేసేదిగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి మతాలను, సిద్ధాంతాలను గౌరవిస్తారు.

Pawan Kalyan- NTR
తెలుగునాట ఎన్టీఆర్ కూడ కాషాయ వస్త్రాలతో చైతన్యరథం పై రాజకీయ ప్రచారం నిర్వహించారు. ప్రజల నుంచి విశేషమైన మద్దతును పొందారు. ఎన్టీఆర్ కూడ గొప్ప సంప్రదాయవాది అయినప్పటికీ మూఢనమ్మకాల వ్యతిరేకి. పవన్ కళ్యాణ్ కూడ ఎన్టీఆర్ లాగే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజల్లో మార్పు కోసం పరితపిస్తున్నారు. ఇటీవల వారాహి పై పవన్ తొలి ప్రసంగాన్ని చేశారు. కాషాయ వస్త్రాల్లో రుషిపుంగవుడిలా దర్శనమిచ్చారు. కాషాయ వస్త్రాలతో ఎన్టీఆర్ లాగా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తారా ? అన్న చర్చ ఒకటి జరుగుతోంది. కొండగట్టు సందర్శన సందర్భంలో ఈ చర్చ మొదలైంది. కాషాయ వస్త్రధారణతో అధికారంలోకి రావచ్చు . రాకపోవచ్చు కానీ ప్రజల్లో ఒక బలీయమైన ముద్ర వేస్తారని చెప్పుకోవడంలో అతిశయోక్తి కాదు.