Crime News : మేక కోసం మానవత్వం మరిచి మనిషిని వేలాడదీశారు

. కాగా ఆ యువకులను చిత్రహింసలు పెడుతున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.

  • Written By: NARESH ENNAM
  • Published On:
Crime News : మేక కోసం మానవత్వం మరిచి మనిషిని వేలాడదీశారు

Crime News : మేకలు దొంగిలించారని ఇద్దరు యువకులను చిత్రహింసలకు గురి చేశారు. నరకం చూపించారు. కాళ్ళను తాళ్లతో కట్టి తలకిందులుగా వేలాడదీసి కింద పొగ పెట్టారు. ఈ అమానవీయ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

మందమర్రి అనే గ్రామంలో కొమురాజుల రాములు, అతని భార్య స్వరూప, కొడుకు శ్రీనివాస్ అంగడి బజార్లో నివాసముంటున్నారు. పట్టణ శివారులోని గంగనేర్ల పంపుల సమీపంలో షెడ్డు వేసి మేకలు పెంచుతున్నారు. వారి వద్ద తేజ అనే యువకుడు పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. అతనితల్లి పారిశుద్ధ్య కార్మికులిగా పనిచేస్తోంది. 20 రోజుల కిందట మంద నుంచి ఒక మేక, ఇనుప రాడ్డు కనిపించకుండా పోయాయి. దీంతో తేజ తో పాటు అతని స్నేహితుడైన దళిత యువకుడు కిరణ్ పై యజమాని కుటుంబం అనుమానం పెంచుకుంది. శుక్రవారం వారిద్దరిని ఇంటికి పిలిపించారు. దారుణంగా కొట్టి..కాళ్లకు తాళ్లతో కట్టి తలకిందులుగా వేలాడదీశారు. కింద పొగ పెట్టి ఊపిరాడకుండా చేశారు. అనంతరం ఇద్దరినీ విడిచిపెట్టారు.

ఇందులో కిరణ్ తల్లిదండ్రులు చిన్ననాటే చనిపోయారు. మందమర్రి పట్టణంలోని అబ్రహం నగర్ లో ఉండే చిన్నమ్మ సరిత ఇంటి వద్ద కిరణ్ ఉంటున్నాడు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కిరణ్ కనిపించకపోయేసరికి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఇంతలో వారికి చిత్రహింసలు పెడుతున్న ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో బాధిత కుటుంబ సభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీరియస్ యాక్షన్ కి దిగారు. రాములు,శ్రీనివాస్, స్వరూప తో పాటు వారి వద్ద పనిచేస్తున్న నరేష్ పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కాగా ఆ యువకులను చిత్రహింసలు పెడుతున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు