Time Travel : టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో 30 ఏళ్ల కిందట రూపొందిన ‘ఆదిత్య 369’ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇండియన్ తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా కూడా ఇదే. శాస్త్రవేత్తలకు సైతం స్ఫూర్తిగా నిలిచిన ఈ చిత్రం సగటు మనిషికి ఆలోచింపజేసింది. తరాల ముందు.. వెనకటి జీవితాన్ని ఆవిష్కరించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఫేస్ చేస్తున్న చాలా పరిణామాలను నాటి దర్శకుడు సింగితం శ్రీనివాసరావు కళ్లకు కట్టినట్టు చూపించారు. శ్రీకృష్ణ దేవరాయల తరాన్ని.. తరువాత 100 సంవత్సరాల భవిష్యత్ కాలాన్ని తనదైన రీతిలో చూపించారు. అయితే దానిని స్ఫూర్తిగా తీసుకున్నాడో..ఏమో కానీ మరో టైమ్ ట్రావెలర్ భూమి మీదకు వచ్చాడు. 2,671 ఏడాది నుంచి వచ్చానని చెబుతున్నాడు. భవిష్యత్ కాలం గురించి ఆయన చెప్పిన మాటలు భయపెడుతున్నాయి. ఓకింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
ఇప్పటివరకూ సినిమాల్లో మాత్రమే ఒక విశ్వం నుంచి మరో విశ్వానికి వెళ్లేందుకు ప్రత్యేక పోర్టల్స్ ఉన్నట్టు చూపించారు. అయితే ఈ పోర్టల్స్ ను టిక్ టాక్ హైజాక్ చేశాయి. టిక్ టాక్ నే ఇప్పుడు ఎక్కువ మంది తమ పోర్టల్ గా చూపిస్తున్నారు. భూత, భవిష్యత్ వార్తమాన కాలాన్ని సమాజానికి అందిస్తున్నారు. అలాగని టైమ్ ట్రావెలర్స్ ఎవరూ మనకు కనిపించరు. అలా టైమ్ ట్రావెలర్ ఒకరు వీడియోను టిక్ టాక్ లో వేసి కలకలం సృష్టించాడు. ప్రపంచానికి భయపెడుతున్నాడు. అతడి పేరు ఎనో అలారిక్. 2,671 సంవత్సరం నుంచి ప్రస్తుత కాలానికి టైమ్ ట్రావెల్ చేసినట్టు చెబుతున్నాడు. డిసెంబరు 2022 నుంచి 2023 మే వరకూ కొన్ని ఘటనలు జరుగుతాయంటూ హెచ్చరిస్తున్నాడు. తన వీడియోలో ఎన్నో రకాల విషయాలను బయటపెట్టాడు. భారీ సునామీ ఒకటి రానుందని.. అది అమెరికాను ఢీకొట్టనుందన్నదే దీని సారాంశం. దీంతో టిక్ టాక్ ను అసరించే యూజర్లు ఇప్పుడు దానిపైనే చర్చించుకుంటున్నారు. వచ్చే ఆరు మాసాల్లో సునామీ పక్క అని చెబుతున్నాడు. అయితే అమెరికాకు తుపాన్లు వస్తుంటాయి కానీ.. ఫస్ట్ టైమ్ సునామీ అనేసరికి మాత్రం వార్త ఆగ్రదేశంలో తెగ వైరల్ గా మారింది.
ఎనో అలారిక్ పేరుతో టిక్ టాక్ అకౌంట్ ఉంది. 26 మంది వ్యూయర్స్ నిత్యం ఫాలో అవుతుంటారు. ఆయన తరచూ భవిష్యత్ లో ఇది జరగబోతుందంటూ వీడియోలు పోస్టు చేస్తుంటాడు. వాళ్లు వాటిని చూసి రీ ట్విట్ చేస్తున్నారు. దీంతో అవి వైరల్ కంటెంట్ గా మారుతున్నాయి. ఇదే యూజర్ గతంలో భూమిపై గ్రహాంతర వాసులు వస్తారని చెప్పాడు. భూమి వైపు రెండు గ్రహాలు దూసుకొస్తాయని కూడా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు 2023 నాటికి పెను విపత్తులు తప్పవని హెచ్చరిస్తున్నాడు. 30 వేలకు పైగా లైక్స్ పొందిన ఆయన వీడియోల్లో కొన్ని కీలకమైన విషయాలను కూడా చెప్పాడు. ‘నేను నిజమైన టైమ్ ట్రావెలర్ ని. మీరు నమ్మకుంటే మీకు ఐదు తేదీలను కూడా చెబుతానని’ తెలిపాడు.అయితే ఆయన చెప్పిన రెండు తేదీల్లో ఎటువంటి పరిణామాలు జరగలేదు. నవంబరు 14న 12 మంది వ్యక్తులు సూర్యుడు నుంచి అతేంద్రియ శక్తులు పొందుతారని చెప్పాడు..కానీ జరగలేదు. నవంబరు 30న జేమ్స్ వెబ్ టెలీస్కోప్ ఒక గ్రహం కనిపెడుతుందని.. అది అచ్చం భూమిని పోలి ఉంటుందని కూడా చెప్పాడు. అదీ జరగలేదు. డిసెంబరు 12న పుష్కరకాలం కిందట మిస్సయిన విమానం ఒకటి తిరిగి ల్యాండ్ అవుతుందని.. అందులో ఒక్కరు కూడా ముసలి వ్యక్తులు ఉండరని చెప్పాడు.. ఆయనిచ్చిన గడువుకు మరో వారం రోజుల వ్యవధి ఉండడంతో ఏం జరుగుతుందో తేలాల్సి ఉంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న నలుగురు టీనేజర్లు ఒక పురాతన కట్టడం చూస్తారని.. దాని నుంచి మరో గెలాక్సీలోకి వెళ్లేందుకు వార్మ్ హోల్స్ తెరిచే పరికరం ఒకటి ఉంటుందని చెప్పాడు. అయితే ఇది నమ్మశక్యంగా లేదు. మే 15న 750 అడుగుల మెగా సునామీ అమెరికాలోని కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో నగరాలపై విరుచకుపడుతుందని హెచ్చరించాడు. దీనిని దీ గ్రేట్ వేవ్ గా సైతం నామకరణం చేశాడు. యూజర్ చెప్పిన తేదీలు, హెచ్చరికలపై నెటిజెన్లు భిన్న కామెంట్లు చేస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికైతే వచ్చే ఏడాది ప్రపంచానికి భారీ ఉత్పాతాలు తప్పవన్న టైమ్ ట్రావెలర్ హెచ్చరికలు మాత్రం జనాలను తెగ భయపెడుతున్నాయి.