China Full Time Daughter Job: కూతురు ఉద్యోగానికి రూ.47 వేల జీతం.. వృద్ధ దంపతుల వద్ద చేరిన చైనా మహిళ!
తన తల్లిదండ్రులతో నిత్యం ఒక గంట డ్యాన్స్ చేస్తుంది. కిరాణా షాపింగ్‌కు వారితోపాటు వెళ్తుంది. అంతేకాదు సాయంత్రం ఆమె తన తండ్రితో కలిసి భోజనం చేస్తుంది. అన్ని ఎలక్ట్రానిక్–సంబంధిత పనులను నిర్వహిస్తుంది. డ్రైవర్‌గా పనిచేస్తుంది. అంతేకాదు నెలాఖరులో ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్తుంది.

China Full Time Daughter Job: ఆమె ఓ వార్తా సంస్థలో 15 ఏళ్లుగా ఉద్యోగం చేస్తోంది. ఉదయం లేచినప్పటి నుంచి∙సాయంత్రం నిద్రపోయే వరకూ నిరంతరం ఒకటే పని. ఉద్యోగంలో బిజీ కారణంగా కుటుంబంతో ఎక్కువసేపు గడపలేదు. పెద్దగా ఫ్రెండ్స్ కూడా లేరు. బంధువుల గురించి తెలుసుకోవడానికి సమయం లేదు. వీటికి తోడు ఆఫీస్‌లో ఎక్కువ సమయం గడపడం కారణంగా పని అంటేనే బోర్ కొట్టేసింది. అయినా జీతం కావాలి కాబట్టి పనిచేస్తూ వస్తుంది. జీతం వస్తేనే జీవితం గడుస్తుంది. ఇలా కొత్తదనం లేని ఉద్యోగంతో నిరాశలో ఉన్న ఆమెకు.. తల్లిదండ్రులు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ‘నువ్వు ఉద్యోగం మానేసి.. మాకు కూతురుగా ఉద్యోగం చేయమని కోరారు. ఇందుకు నెలకు 570 డాలర్లు అంటే భారతీ కరెన్సీలో రూ.47 వేలు ఇస్తామని చెప్పారు. దీంతో ఆ కూతురు మరో మాట కూడా చెప్పకుండా తన ఉద్యోగానికి గుడ్‌బై చెప్పింది. ఇప్పుడు కూతురుగా ఉద్యోగం చేస్తోంది.
కన్నవారి వద్ద కూతురు ఉద్యోగం..
చైనా… ఈ పేరు వినగానే మనకు చిత్ర విచిత్రాలు గుర్తుకొస్తాయి. అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతున్న ఆ దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని ఘటనలు జరుగుతాయి. వ్యాధులు కూడా అక్కడే పుడతాయి. కొత్తకొత్త సంస్కృతులు కూడా మొదలవుతాయి. ఇలాగే ఇప్పుడు ఆ దేశంలో కొత్త సంస్కృతి మొదలైంది. అదే ‘పూర్తి సమయం కుమమార్తె’(పర్మినెంట్ డాటర్) జాబ్. వేగంగా ఈ సంస్కృతి చైనాలో విస్తరిస్తోంది.
40 ఏళ్ల మహిళకు కూతురు ఉద్యోగం..
చైనాకు చెందిన నియానన్ అనే 40 ఏళ్ల మహిళ ఒక వార్తా సంస్థలో 15 సంవత్సరాలు పనిచేసింది. 2022లో జీవితం రొటీన్ అనే ఫీలింగ్‌తోపాటు అధిక ఒత్తిడి, ఆఫీసులో ఎప్పుడూ అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి. ఆ సమయంలో నియానన్‌కు ఆమె తల్లిదండ్రులు అండగా నిలబడ్డారు. తమ కూతురికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. తమ కూతురు ఉద్యోగం వదిలి తమకు కూతురిగా ఉద్యోగం చేయాలనీ సూచించారు. అంతేకాదు నియానన్ తల్లిదండ్రులు నెలకు 10,000 యువాన్లు కంటే ఎక్కువ పెన్షన్ తీసుకుంటున్నారు. తమ పెన్షన్ నుంచి 4 వేల యువాన్లు వేతనంగా ఇస్తామని హామీనిచ్చారు. దీంతో నియానన్ తన తల్లిదండ్రులకు సంపూర్ణమైన కూతురిగా మారాలని నిర్ణయించుకుంది. ఉద్యోగాన్ని వదిలి పూర్తి సమయం కుమార్తె పాత్రను స్వీకరించి ఆనందంగా విభిన్నమైన దినచర్యను చేపట్టింది.
కూతురు విధులు ఇవీ..
తన తల్లిదండ్రులతో నిత్యం ఒక గంట డ్యాన్స్ చేస్తుంది. కిరాణా షాపింగ్‌కు వారితోపాటు వెళ్తుంది. అంతేకాదు సాయంత్రం ఆమె తన తండ్రితో కలిసి భోజనం చేస్తుంది. అన్ని ఎలక్ట్రానిక్–సంబంధిత పనులను నిర్వహిస్తుంది. డ్రైవర్‌గా పనిచేస్తుంది. అంతేకాదు నెలాఖరులో ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్తుంది.
తల్లిదండ్రులకు సేవ.. ఓ చికిత్స..
ఇలా తన తల్లిదండ్రుల చుట్టూ తాను తిరగడం ఒక చికిత్స వంటిదే అని అంటుంది నియానన్. అయితే తమ కూతురుకి తగిన ఉద్యోగం దొరికి మంచి జీతం వచ్చే వరకూ ఇక్కడే ఉండమని తల్లిదండ్రులు చెప్పారు. అంతేకాదు.. తగిన ఉద్యోగం దొరికితే వెళ్లిపో, లేదా పని చేసే మూడ్ లేకపోతే మాతో ఇక్కడే ఉండు అని తల్లిదండ్రులు అంటున్నారు. నిరంతరం నియానన్‌కు భరోసా ఇస్తున్నారు.
ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న సంస్కృతి..
‘పూర్తి–సమయం కుమార్తె’(పర్మినెంట్ డాటర్) అనే కాన్సెప్ట్ చైనా దేశంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. ఆదరణ కూడా పొందుతోంది. చైనాలోని యువత అత్యంత పోటీతత్వ జాబ్ మార్కెట్, అలసిపోయిన పని షెడ్యూల్‌లకు ప్రత్యామ్నాయంగా ప్రజాదరణ పొందింది. ఈ ప్రత్యామ్నాయ జీవనశైలి సంాంప్రదాయ పని పరిమితుల నుంచి ఎక్కువ స్వయంతృప్తి, స్వేచ్ఛను ఇస్తుందని అంటున్నారు అక్కడి యువత. కొంతమంది మాత్రం తల్లిదండ్రులపై ఆధారపడటాన్ని తప్పుపడుతున్నారు.
