Women Reservation Bill 2023: ‘మహిళల’ను ముందు పెట్టి మోదీ ఫైటింగ్.. నెగ్గుతాడా?
మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా విపక్షాలకు కేంద్రం షాక్ ఇవ్వడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ బీజేపీ కూటములతోపాటు ప్రాంతీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.

Women Reservation Bill 2023: కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడంతోపాటు త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మోదీ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే వన్ నేషన్.. వన్ ఎలక్షన్ కాన్సెప్ట్‌పై దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపారు. ఈమేరకు ఓ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. దీంతో విపక్షాల అనెన్షన్‌ను ఒక్కసారిగా డైవర్ట్ చేశారు. తాజాగా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేశారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సోమవారం కేబినెట్ సమావేశంలో ఒకే చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే.. పార్లమెంట్, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. కొంత కాలంగా ప్రతిపక్ష పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని కేంద్రంపై వత్తిడి తెచ్చాయి. ఈనేపథ్యంలో కేంద్ర కేబినెట్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
కొత్త పార్లమెంట్ భవనంలో తొలి బిల్లు..
మహిళా రిజర్వేషన్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టడం దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తోంది. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వషన్ కల్పించే బిల్లు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉంది. దీన్ని ఈ సమావేశాల్లో క్లియర్ చేసేందుకు బీజేపీ వ్యూహాన్ని రచిస్తోంది. కొత్త పార్లమెంట్ భవనంలో మంగళవారం నుంచి సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించి రికార్డు నెలకొల్పాలని కేంద్రం భావిస్తోంది.
విపక్షాల డిమాండ్..
ప్రతిపక్ష నేతలు కూడా ఈ బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్న టైంలో కేంద్రం ఓ ముందడుగు వేయాలని భావిస్తోంది. ఈ బిల్లు ఆమోదంలో కూడా ఎలాంటి అవాంతరాలు ఉండవని ఆలోచిస్తోంది.
ఈ క్రమంలో ప్రత్యేక సమావేశాల ప్రారంభానికి ముందు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష కూటమి సహా ఎన్డీయే నేతలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరగ్గా ఇండియా క ఊటమి నాయకులతోపాటు ఎన్డీయే నేతలు కూడా మద్దతుగా నిలిచారు. దీన్ని బట్టి ఈ బిల్లు పార్లమెంట్‌లో నెగ్గడం పెద్ద కష్టం కాదన్నది స్పష్టమైంది.
పాత పార్లమెంట్‌లో చివరి కేబినెట్ భేటీ..
ఈ క్రమంలో సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. పాత భవనంలో చివరి సమావేశం నిర్వహించారు. ఈ సభలో 75 ఏళ్ల పార్లమెంట్ సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రధానితోపాటు అనేక పార్టీల నేతలు పార్లమెంటు గొప్పదనాన్ని కీర్తించారు. అనంతరం పార్లమెంట్‌లోనే ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం.
విపక్షాలకు షాక్..
మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా విపక్షాలకు కేంద్రం షాక్ ఇవ్వడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ బీజేపీ కూటములతోపాటు ప్రాంతీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. తెలంగాణలో అయితే బీఆర్‌ఎస్ 115 స్థానాలకు 114 మంది అభ్యర్థులను కూడా ప్రకటించింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపితే రిజర్వేషన్లు మారనున్నాయి. పదేళ్ల ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయిస్తారు. 33 శాతం సీట్లు మహిళలకే కేటాయిస్తారు. దీంతో చాలా స్థానాల్లో ఆశావహులకు షాక్ తప్పదు. కేటాయించిన టికెట్ కూడా వదుకోవాల్సిందే.
మొత్తంగా మహిళను ముందు పెట్టి.. వచ్చే ఎన్నికల్లో నెగ్గాలని మోదీ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ పార్లన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
