Thaman- Mani Sharma: ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ డిమాండ్ ఉన్న ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులలో ఒకరు థమన్..ప్రతీ స్టార్ హీరో కి థమన్ అందించే సంగీతం కావాలి..ఆ స్థాయిలో ఆయన క్రేజ్ ఎగబాకింది.. తమిళ స్టార్ హీరోలు కూడా ఈమధ్య థమన్ కోసం పడిగాపులు కాయడం విశేషం..ఎందుకంటే థమన్ ఇచ్చే ట్యూన్స్ తో పాటుగా ఆయన అందించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్తుంది..ఇది మనం చాలా సినిమాలకు గమనించాము..అఖండ , భీమ్లా నాయక్ వంటి చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయంటే థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పాత్ర ఎంతో ఉంది.

Thaman- Mani Sharma
అందుకే థమన్ కోసం టాప్ డైరెక్టర్స్ అలా పడిగాపులు కాస్తున్నారు..ప్రస్తుతం ఆయన చేతిలో తెలుగు మరియు తమిళం భాషలకు కలిపి 15 సినిమాలు ఉన్నాయి..థమన్ లో ఇంత గొప్ప సంగీత ప్రతిభ రావడానికి ప్రధాన కారణం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ దగ్గర శిష్యరికం చెయ్యడమే.

Thaman- Mani Sharma
థమన్ మణిశర్మ వద్ద చాలాకాలం వరుకు కీ బోర్డు ప్లేయర్ గా పనిచేసేవాడు..అయితే ఇటీవలే అలీ తో సరదాగా అనే టాక్ షో లో పాల్గొన్న మణిశర్మ తన శిష్యుడు థమన్ తో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు, ఆయన మాట్లాడుతూ ‘నాకు ఒకప్పుడు కోపం చాలా ఎక్కువే..ట్యూన్స్ తో పాటుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అన్ని సినిమాలకు నేనే మ్యానేజ్ చేసుకునే వాడిని..ఒకానొక సమయం లో నేను ఒకేసారి 20 సినిమాలకు పని చేసిన సందర్భాలు కూడా ఉండేవి..వర్క్ లోడ్ చాలా ఉండేది..ఆ సమయం లో థమన్ నాకు చాలాసార్లు చిరాకు రప్పించేవాడు..నా చేతిలో ఏ వస్తువు ఉంటె ఆ వస్తువుని థమన్ వైపు విసిరి చావబాదేవాడిని..నా కోపం చూసి వాడు భయపడి మానిటర్ వెనుక దాక్కున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి..అలాంటి థమన్ నా దగ్గర మ్యూజిక్ నేర్చుకొని నేడు దేశం గర్వించదగ్గ సంగీత దర్శకులలో ఒకరిగా నిలిచి నేషనల్ అవార్డుని సైతం దక్కించుకోవడం గురువుగా నాకు చాలా గర్వం వేస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు మణిశర్మ.