NTR 30: పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ ని కాజేసిన జూనియర్ ఎన్టీఆర్.. మండిపడుతున్న ఫ్యాన్స్
త్రివిక్రమ్ కి ప్రత్యేకంగా ఫోన్ చేసి, మా సినిమా కథ ఇది అని, దీనికి ఈ ‘దేవర’ టైటిల్ తప్ప మరొకటి పెట్టలేము అని వివరంగా చెప్పడం తో త్రివిక్రమ్ వెనక్కి తగ్గి ఆ ‘దేవర’ టైటిల్ ని వదిలేసేందుకు ఒప్పుకున్నాడట.

NTR 30: టాలీవుడ్ లో సాధారణంగా ఒక హీరో చెయ్యాల్సిన సినిమా మరొకరు చెయ్యడం, ఒక హీరో కి వాడాల్సిన పాటని మరో హీరో కి వాడడం ఇలాంటివి చాలా గతం లో ఎన్నో జరిగాయి. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా టైటిల్ విషయం లో కూడా అదే జరిగింది. #RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆయన కొరటాల శివ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈమధ్యనే ప్రారంభమై రెండు షెడ్యూల్స్ ని కూడా పూర్తి చేసుకుంది.రెండవ షెడ్యూల్ లో రామోజీ ఫిలిం సిటీ లో వేసిన రైల్వే స్టేషన్ సెట్ లో ఎన్టీఆర్ మరియు సైఫ్ అలీ ఖాన్ పై ఒక పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించారు.ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాని ప్రస్తుతం #NTR30 అనే పేరుతోనే అందరూ పిలుస్తున్నారు.
అయితే ఈ సినిమాకి ‘దేవర’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.వాతావనికి ఈ టైటిల్ ని పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ సినిమా కి పెడుదామని అనుకున్నారు.ఎందుకంటే ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపిస్తున్నాడు కాబట్టి. కానీ అదే టైటిల్ కోసం కొరటాల శివ కూడా పోటీ పడ్డాడు.
త్రివిక్రమ్ కి ప్రత్యేకంగా ఫోన్ చేసి, మా సినిమా కథ ఇది అని, దీనికి ఈ ‘దేవర’ టైటిల్ తప్ప మరొకటి పెట్టలేము అని వివరంగా చెప్పడం తో త్రివిక్రమ్ వెనక్కి తగ్గి ఆ ‘దేవర’ టైటిల్ ని వదిలేసేందుకు ఒప్పుకున్నాడట.ఇప్పుడు పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ సినిమాకి ‘బ్రో’ అనే టైటిల్ ని పెట్టినట్టు సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ, ఈ టైటిల్ ని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారట. అధికారిక ప్రకటన చేసిన రోజు ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
