IT Layoffs 2023: ఉద్యోగాలు ఊడుతున్నాయి… పింక్ స్లిప్ లు వచ్చి పడుతున్నాయి: ఐటీ ఇప్పట్లో కోలుకుంటుందా?

ఆర్థిక మాంద్యం భయాలు మొదలైనప్పటి నుంచి ఐటి పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. చాలావరకు ప్రాజెక్టులు తగ్గిపోయాయి. క్లైంట్స్ తగ్గిపోయారు. ఇదే సమయంలో చాలావరకు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి.

  • Written By: Bhaskar
  • Published On:
IT Layoffs 2023: ఉద్యోగాలు ఊడుతున్నాయి… పింక్ స్లిప్ లు వచ్చి పడుతున్నాయి: ఐటీ ఇప్పట్లో కోలుకుంటుందా?

IT Layoffs 2023: అమెజాన్ నుంచి మెటా దాకా.. రిలయన్స్ నుంచి డిస్నీ హాట్ స్టార్ దాకా.. ఏ ఒక్క కంపెనీ కూడా ఉద్యోగులను భరించే స్థితిలో లేదు. ఏమాత్రం ఎక్కువ అనిపించినా వెంటనే తొలగిస్తోంది. రెండో సమాచారం లేకుండానే పక్కన పెడుతోంది. దీంతో మొన్నటిదాకా 5 అంకెల స్థాయిలో వేతనాల పొందిన వారు నిర్దాక్షిణ్యంగా బయటికి పోతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇంతకీ ఐటీ పరిశ్రమకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇది ఇప్పట్లో కోలుకుంటుంది? ఈ విషయాలపై ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు.

ఆర్థిక మాంద్యంతో..

ఆర్థిక మాంద్యం భయాలు మొదలైనప్పటి నుంచి ఐటి పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. చాలావరకు ప్రాజెక్టులు తగ్గిపోయాయి. క్లైంట్స్ తగ్గిపోయారు. ఇదే సమయంలో చాలావరకు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇంకొన్ని కొత్త కంపెనీలు ఉద్యోగులను తీసివేయడంతోపాటు కొత్త నియామకాలు దాదాపు నిలిపివేశాయి. మరి కొన్ని కంపెనీలు కొత్త వాళ్లను చేర్చుకోవడంలో తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. అంతేకాదు ముందుగా చెప్పిన దాని ప్రకారం వేతనాలు ఇవ్వలేమని, వేతనాలు తగ్గించుకొని చేరితే ఉద్యోగం ఇస్తామని ప్రకటిస్తున్నాయి. చివరికి ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను కూడా కంపెనీలు పక్కన పెడుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, ఆర్థిక మాంద్యం హెచ్చరికలతో అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ లే అప్స్ కు తెర లేపాయి. ఏడాది నుంచి ఈ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏడాది ఉద్యోగుల తొలగింపు గత ఏడాది కంటే మించిపోయింది. ఫలితంగా 2023 సంవత్సరం కూడా ఐటీ ఉద్యోగుల పై గుది బండలాగే మారిపోయిందని చెప్పవచ్చు. గత ఏడాదితో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 7.7% తగ్గిపోయింది. మార్చితో దాదాపు 60 వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో జాబ్స్ కోల్పోయారు. ఐటీ రంగంలో కొత్త ఉపాధి కల్పన తగ్గిపోవడం, ఐటీ నియామకంలో ప్రపంచ మందగమనానికి అర్థం పడుతుంది. ఇక దీనికి రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కూడా తోడు కావడంతో పరిస్థితి మరింత దిగుజారిపోయిందని అన్ని పనులు చెబుతున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో రాబోయే కొన్ని నెలల్లో థర్డ్ పార్టీ ద్వారా కాంట్రాక్ట్ నియామకాలు తక్కువ స్థాయిలో జరిగే అవకాశం ఉందని ఐటీ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ కోతల నేపథ్యంలో దేశంలో ఏప్రిల్ నెలలో నిరుద్యోగ రేటు వరుసగా నాలుగో నెలలో 8.11 శాతానికి పెరిగింది. ఇది అంతకుముందు నెలలో 7.8% గా ఉండేది. కాగా ఈ వరుస పరిణామాలతో ఐటీ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు లేవని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Life style News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube