Bhola Shankar Teaser: ‘భోళా శంకర్’ టీజర్ వచ్చేస్తుంది..ఈసారి మెగాస్టార్ మాస్ మామూలుగా ఉండదు!
అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి చేస్తున్న చిత్రం ‘భోళా శంకర్’ . తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన అజిత్ ‘వేదలమ్’ చిత్రానికి ఇది రీమేక్. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Bhola Shankar Teaser: ఈ ఏడాది ప్రారంభం సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. చిరంజీవి కి వరుస ఫ్లాప్స్ తర్వాత వచ్చిన సినిమా కావడం తో మెగా ఫ్యాన్స్ సంబరాలు అంబరాలను అంటే రేంజ్ లో చేసుకున్నారు. సుమారుగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఆల్ టైం టాప్ 5 చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి చేస్తున్న చిత్రం ‘భోళా శంకర్’ . తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన అజిత్ ‘వేదలమ్’ చిత్రానికి ఇది రీమేక్. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఆగస్టు 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా సంబంధించిన టీజర్ ని అతి త్వరలోనే విడుదల చెయ్యబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1:23 నిమిషాలకు టీజర్ కి సంబంధించిన పూర్తి వివరాలను తెలియచేయనున్నారు మేకర్స్.ఈ చిత్రం లో కీర్తి సురేష్ చిరంజీవి కి చెల్లెలుగా నటిస్తుండగా, తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం అన్నాచెల్లి అనుబంధానికి అద్దం పట్టేలా ఉంటుందట.పేరు కి రీమేక్ కానీ, మన తెలుగు ఆడియన్స్ నేటివిటీ కి పూర్తిగా కనెక్ట్ అయ్యే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట డైరెక్టర్ మెహర్ రమేష్.
అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి ఇలాంటివన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడట. ఆయన పర్యవేక్షణ లో ఇన్ పుట్స్ తీసుకుంటూ మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని మెగాస్టార్ మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. మరి అభిమానులను ఈ సినిమా ఎంత మేరకు అలరిస్తుందో తెలియాలంటే ఆగస్టు వరకు వేచి చూడాల్సిందే.