Teachers Fighting: టీచర్ల ఫైటింగ్.. విద్యార్థుల ముందే జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు!
పిల్లలు విద్యాబుద్ధులు.. కొట్టుకుంటే సర్ధి చెప్పాల్సిన టీచర్లే వీర లెవల్లో కుమ్మేసుకున్నారు. వీధుల్లో నీటి కుళాయిల వద్ద జరిగే ఫైటింగ్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఉంది ఈ కొట్లాట.

Teachers Fighting: ఉపాధ్యాయులు అంటే క్రమశిక్షణకు మారుపేరు. సమాజంలో వారికి ఒక గుర్తింపు గౌరవం ఉంటుంది. అయితే దేశంలోని ఇతర ప్రాంతాల ఉపాధ్యాయులు వేరు.. బిహారీ ఉపాద్యాయులు వేరు. స్పెలింగ్ రాని వారు కూడా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఇక తాజాగా పాట్నాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య జరిగిన ఫైటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాఠశాలలో కిటికీ మూసివేయడంపై టీచర్స్ మధ్య తలెత్తిన గొడవ క్రమంగా జట్లు పట్టుకుని కొట్టుకునే వరకు వెళ్లింది.
విద్యార్థులకు బుద్ధి చెప్పాల్సిన వారే..
పిల్లలు విద్యాబుద్ధులు.. కొట్టుకుంటే సర్ధి చెప్పాల్సిన టీచర్లే వీర లెవల్లో కుమ్మేసుకున్నారు. వీధుల్లో నీటి కుళాయిల వద్ద జరిగే ఫైటింగ్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఉంది ఈ కొట్లాట. పట్నాకు సమీపంలోని కొరియా పంచాయితీలో ఈ ఫైటింగ్ సీన్ కనిపించింది. ముందు బడిలోని క్లాస్ రూమ్‌లో కొట్టుకున్న టీచర్స్… తర్వాత పాఠశాల గ్రౌండ్‌లో పిచ్చ పిచ్చగా కొట్టుకున్నారు. అక్కడకు వచ్చిన వారంతా ఆ ఫైటింగ్ సీన్ చూస్తూ ఎంజాయ్ చేశారు. ఎప్పుడూ సైలెన్స్, కొట్టుకోవద్దు, మంచిగా ఉండండీ అని చెప్పే టీచర్స్ అలా బజారున పడి కొట్టుకుంటుంటే చూస్తూ ఉండిపోయారు.
ట్రైనింగ్ క్లాస్ చూసేందుకు..
పాఠశాలలో ఏదో ట్రైనింగ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. శిక్షణను చూసేందుకు చాలా మంది తల్లిదండ్రులు, చిన్న పిల్లలు అక్కడకు వచ్చారు. దీంతో ప్రధానోపాధ్యాయురాలు కిటికీలు వేయాలని ఆదేశించారు. అందుకు క్లాస్ టీచర్ ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. అక్కడ జనాలు ఉన్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయి బండబూతులు తిట్టుకున్నారు. అలా బయటకు వస్తూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
మరో ఉపాధ్యాయురాలు కూడా సాయం..
ప్రధానోపాధ్యాయురాలు కాంతి కుమారి, ఉపాధ్యాయురాలు అనితా కుమారి ఒకరి నొకరు తిట్టుకుని కొట్టుకున్నారు. కాంతి కుమారి క్లాస్‌రూమ్ నుంచి బయటకు వెళ్లడం ప్రారంభించగానే, టీచర్ చేతిలో చెప్పుతో ఆమె వెంట పరుగెత్తి కొట్టడం ప్రారంభించింది. మరొక ఉపాధ్యాయులు ఆమెకు సాయం చేసింది. ముగ్గురు కూడా నేలపై కుస్తీ పడ్డారు. ఒకరు చెప్పుతో కొట్టగా, మరొకరు కర్రతో కొట్టారు. చివరకు కొంతమంది వ్యక్తులు వచ్చి వారిని వారించారు. విడిపించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య వ్యక్తిగత గొడవలు ఈ కొట్లాటకు దారి తీసిందని మండల విద్యాధికారి చెప్పారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియజేశామని, తదుపరి చర్య కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.
Bihar: A fight broke out between two female teachers in a government school during classhours in Patna.
The incident took place on Thursday in Kaudiya panchayat of Bihta block. pic.twitter.com/g1j6HJl2sq
— The New Indian (@TheNewIndian_in) May 25, 2023