Jagan Politics : నిన్న జరిగిన రెండు ఘటనలు ఏపీ సీఎం జగన్ నైజాన్ని ఎండగట్టాయి. ఆంధ్రప్రజలు నివ్వెరపోయిన పరిస్థితి నెలకొంది. సొంత బాబాయి వైఎస్ వివేకా హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ.. రెండోది సొంత చెల్లెలు షర్మిల తెలంగాణలో అరెస్ట్ కావడం.. రెండూ జగన్ కు చెంపపెట్టులాంటివే.
సుప్రీంకోర్టు తీర్పు అనంతరం నైతిక విలువలు ఉంటే జగన్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసేయాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని పరోక్షంగా సుప్రీంకోర్టు అభిశంసించింది. అక్కడ విచారణ సక్రమంగా విచారణ జరగదని సుప్రీంకోర్టు నిర్ణయానికి వచ్చింది.. సాక్ష్యులను బెదిరిస్తారని అంటూ.. నిష్పక్షపాతంగా విచారణ జరగదని సుప్రీంకోర్టు భావించిందంటే పరిస్థితులు ఏపీలో ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ కుట్ర కోణాన్ని ఛేదించాలంటూ సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశించిందంటే అర్థం చేసుకోవచ్చు.
దీన్ని సజ్జల లాంటి వారు నిస్సిగ్గుగా వెనకేసుకురావడం చూస్తే దారుణం అని చెప్పొచ్చు. వైఎస్ వివేకా కేసులో సాక్ష్యాలను మాయం చేయడం.. ఆయన కుటుంబంపైకే కేసును నెట్టేసే తీరు చూస్తుంటే ఏపీలో న్యాయం జరగదని సుప్రీంకోర్టు భావించింది. ఏకంగా సీబీఐ అధికారులపైనే కేసులు పెడుతున్నారంటే జగన్ సర్కార్ ఎంతగా ఈ వైఎస్ వివేకా కేసును తొక్కేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
జగన్ ను గెలిపించడానికి రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన షర్మిల అరెస్ట్ అయినా కూడా జగన్ స్పందించకపోవడం మరింత దారుణం అనిచెప్పొచ్చు.
జగన్ నైజాన్ని ఎండగట్టిన ఈ రెండు ఘటనలపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.