Allu Arjun Rejected Story: #RRR సినిమా గ్రాండ్ సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..జనతా గ్యారేజీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కావడం తో ఈ కాంబినేషన్ పై ట్రేడ్ లో షూటింగ్ ప్రారంభం కాకముందు నుండే మంచి బజ్ ఏర్పడింది..
కానీ కొరటాల మెగాస్టార్ చిరంజీవి తో చేసిన రీసెంట్ మూవీ ఆచార్య చిత్రం భారీ డిజాస్టర్ ఫ్లాప్ కావడం తో ఎన్టీఆర్ అభిమానులు తమ హీరోతో ఈయన ఎలాంటి సినిమా చేస్తాడో అని భయపడ్డారు..కానీ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా కి సంబంధించిన మోస్టర్ పోస్టర్ వీడియో ని నిన్న సోషల్ మీడియా లో విడుదల చెయ్యగా దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..

NTR 30
కొరటాల శివ లో ఇంత మాస్ యాంగిల్ ఉంటుందా అని అభిమానులు సైతం ఆశ్చర్యపొయ్యేలా చేసింది ఈ మోషన్ పోస్టర్ వీడియో..చేతిలో రెండు కత్తులను పట్టుకొని సముద్రపు ఒడ్డున నిల్చొని ఉన్న ఎన్టీఆర్ ని చూసి అభిమానులు ఆది , సింహాద్రి రోజులు గుర్తు చేసుకున్నారు..ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడం తో,ఈసారి కొరటాల శివ తనని తానూ నిరూపించుకోవడం కోసం స్క్రిప్ట్ పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్టు ఈ మోషన్ పోస్టర్ చూస్తేనే అర్థం అయిపోతుంది..
Also Read: Shekar Movie Review: రివ్యూ : శేఖర్ మూవీ – హిట్టా ? ఫట్టా ?
ఇది ఇలా ఉండగా ఈ సినిమా స్టోరీ తొలుత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేద్దాం అనుకున్నాడట కొరటాల శివ..అప్పట్లో వీళ్లిద్దరి కాంబినేషన్ ని స్వయంగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా అధికారికంగా ప్రకటించి ఒక్క కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేసిన సంగతి మన అందరికి గురించి గుర్తు ఉండే ఉంటుంది..ఈ కాన్సెప్ట్ పోస్టర్ నిన్న విడుదల చేసిన ఎన్టీఆర్ మోషన్ పోస్టర్ వీడియో కి సరిసమానమైన పోలిక ఉండడం తో అల్లు అర్జున్ తో చెయ్యాల్సిన మూవీ ని ఎన్టీఆర్ తో చేసున్నారా అనే అనుమానాలు ప్రారంభం అయ్యాయి..కొన్ని విశ్వసనీయ వర్గాలను విచారించగా అది నిజమే అని తేలింది..

Allu Arjun
అలా అల్లు అర్జున్ చేయాల్సిన ప్రాజెక్ట్ చివరికి ఎన్టీఆర్ కి షిఫ్ట్ అయ్యింది అన్నమాట..అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్ మధ్య మంచి సన్నిహిత్య సంబంధాలు ఉండడం తో ఆయన కూడా ఎన్టీఆర్ కి ఈ స్టోరీ ఇవ్వడానికి ఏ మాత్రం అభ్యంతరం వ్యక్తపర్చలేదు అట..చూడాలి మరి ఈ సినిమా అభిమానులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో అనేది.
Also Read: CM KCR Delhi Tour: కేసీఆర్ చలో ఢిల్లీ.. దేశవ్యాప్త పర్యటనకు ప్రణాళిక.. ఇక జాతీయ రాజకీయాలకే ఫిక్స్