Star Music Director: అప్పుల ఊబిలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్… బెంజ్ కారు నుండి గంజి తాగే పరిస్థితి

టాలీవుడ్ విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ మ్యూజిక్ డైరెక్టర్ 80కి పైగా చిత్రాలకు మ్యూజిక్ అందించాడు. బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ లేవు కానీ ఫేమ్ అయితే ఉంది. మంచి బీజీఎమ్ ఇస్తాడనే పేరుంది.

  • Written By:
  • Publish Date - May 26, 2023 / 12:47 PM IST

Star Music Director

Star Music Director: ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయని అంటారు. కోటీశ్వరులుగా కారుల్లో తిరిగిన బ్రతుకులు రోడ్డున పడటం పెద్ద అతిశయోక్తికాదు. అలా చాలా మంది జీవితాల్లో జరిగాయి. నిర్ణయాలు భవిష్యత్ ని నిర్ణయిస్తాయి. మన అంచనాలు తప్పైతే తిప్పలు తప్పవు. టాలీవుడ్ లో సక్సెస్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందిన ఆ వ్యక్తి పరిస్థితి దారుణంగా తయారైందన్న మాట వినిపిస్తుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందట.

టాలీవుడ్ విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ మ్యూజిక్ డైరెక్టర్ 80కి పైగా చిత్రాలకు మ్యూజిక్ అందించాడు. బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ లేవు కానీ ఫేమ్ అయితే ఉంది. మంచి బీజీఎమ్ ఇస్తాడనే పేరుంది. చాలా చిత్రాలకు మంచి మ్యూజిక్ అందించారు. టైర్ టు హీరోల బెస్ట్ ఛాయిస్ అయ్యాడు. కొన్ని చిత్రాల్లో ఆయన పాటలు మెప్పించాయి. ఆర్ ఆర్ పైన పట్టుంది. మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగుతున్న తరుణంలో మరో టర్న్ తీసుకున్నాడు.

నిర్మాతగా మారి మూడు చిత్రాలు పట్టాలెక్కించాడు. ఈ మూడు ప్రాజెక్ట్స్ లో ఒక విడుదలై ఫ్లప్ అయ్యింది. ఒక ప్రాజెక్ట్ చిత్రీకరణ సమయంలోనే ఆగిపోయింది. మరో ప్రాజెక్ట్ విడుదలకు నోచుకోలేదు. దీంతో పెద్ద ఎత్తున అప్పులపాలయ్యాడట. తన సినిమాలకు అప్పులు ఇచ్చిన ఫైనాన్సర్స్ ఇబ్బంది పెడుతున్నారు. ఏకంగా ఆఫీస్ కి వెళ్లి దాడికి తెగబడ్డారట. ఎలాగైనా అప్పు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారట.

సినిమా నిర్మాణం వైపు వెళ్లి భారీగా నష్టపోయాడట. చివరికి తనతో పని చేసిన లిరిసిట్స్ వద్ద చేబదులు వెయ్యి రెండు వేలు చేబదులు తీసుకుంటున్నాడట. దానికి తోడు ఆఫర్స్ ఆగిపోయాయట. ఈ కారణంగా వడ్డీలు, ఈ ఎం ఐ లు కట్టుకోలేం పరిస్థితికి చేరాడట. ఒకప్పుడు బెంజ్ కారులో తిరిగిన ఆ మ్యూజిక్ డైరెక్టర్ పరిస్థితి గంజికి పడిపోయిందన్నారు.