Parvati Nair: ‘నన్ను చెప్పుతో కొట్టింది.. ముఖంపై ఉమ్మేసింది.. నాపై లైంగిక కేసులు పెడతానని బెదిరించింది..’ అంటూ ఓ వ్యక్తి ప్రముఖ హీరోయిన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన గురించి అన్ని విషయాలు బయటపడినందు.. ఆ వివరాలన్నీ చెప్పకుండా ఉండడానికి నన్ను బెదిరించిందని ఆ హీరోయిన్ దగ్గర పనిచేసే వ్యక్తి ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ అయింది. అయితే హీరోయిన్ వెర్షన్ వేరే ఉంది. తన ఇంట్లో సదరు వ్యక్తి దొంగతనం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణకు వెళ్లిన పోలీసులకు బాధితుడు ఇలాంటి రిప్లై ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరా హీరోయిన్..? అసలేం జరిగింది..?

Parvati Nair
పార్వతి నాయర్.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ తమిళ, మలయాళ సినిమాల్లో ఈ అమ్మడు వెరీ హాట్. అందాల ఆరబోతలో ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. మలయాళంలో సీనీ ఎంట్రీ ఇచ్చినా తమిళ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆ రాష్ట్రంలోని చెన్నైలో సెటిలైంది. నగరంలోని నుంగంబాక్కంలో ఓ పెద్ద ఇల్లు కట్టుకుంది. ఆ ఇంట్లో పార్వతి నాయర్ కు తోడుగా కొంతమంది పని మనుషులు కూడా ఉన్నారు. అయితే ఇటీవల తన ఇంట్లో పనిచేసే ఓ వ్యక్తిపై పార్వతి నాయర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన ఇంట్లో రూ.9 లక్షల విలువైన రెండు వాచీలు, రూ.1.5 లక్షల విలువైన ఐ పోన్, రూ.2 లక్షల విలువైన ల్యాప్ టాప్ లు కనిపించడం లేదని తెలిపింది. ఇవి చోరీకి గురికావడానికి తన ఇంట్లో పనిచేసే సుభాషే కారణమని పేర్కొంది. పార్వతి నాయర్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా ఆమె ఇంట్లో పనిచేసే సుభాష్ ఇంటికి వెళ్లి చెక్ చేశారు. ఈ సందర్భంగా సుభాస్ పార్వతి నాయర్ పై సంచలన ఆరోపణలు చేశారు.

Parvati Nair
‘ఆ హీరోయిన్ నాపై లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరించింది. తన ఇంట్లోకి రాత్రిపూట ఎవరెవరవో వచ్చేవాళ్లు.. అది నేను చూశానని, నేను ఎవరికి చెప్పకుండా ఉండడానికి నన్ను టార్చర్ పెట్టేది.. ఆమె ఇంట్లో ఎవరో దొంగతనం చేశారు. కానీ ఆ నేరం నాపై నెట్టివేయడానికి ప్రయత్నిస్తోంది. గతంలో ఓసారి నన్ను చెప్పుతో కొట్టింది.. నా ముఖంపై ఉమ్మేసింది. అయినా నేనేం చేయలేదు..నన్ను కావాలనే ఈ దొంగతనం కేసులు ఇరికించింది..’ అని సుభాష్ పేర్కొన్నాడు. అయితే పార్వతి, సుభాష్ చెప్పిన విషయాలపై పోలీసులు వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అవసరమైతే పార్వతి నాయర్ ను కూడా విచారించే అవకాశం ఉంది.