Hrithik Roshan: సినిమా నటుల పర్సనల్ లైఫ్ విభిన్నంగా ఉంటుంది. పీకల్లోతు ప్రేమలో ఉన్నామని చెప్పి పెళ్లి చేసుకున్నవారు.. చిన్న చిన్న గొడవలతో బంధాన్ని తెంచుకుంటారు. ఈ క్షణాన కలిసున్న వారు… మరో నిమిషం తరువాత కొత్త వారితో కనిపిస్తారు. ఈ పరిస్థితి బాలీవుడ్లో విపరీతంగా ఉంటుంది. ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకున్నవారు ఇండస్ట్రీలో ఎందరో స్టార్ హీరోలు ఉన్నారు. ఇప్పుడు వారిలో హృతిక్ రోషన్ కూడా చేరాడు. అయితే తన భార్యకు విడాకులు ఇచ్చిన తరువాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోకున్నా.. వారు లివింగ్ రిలేషన్ కొనసాగిస్తున్నారు. లేటెస్టుగా ఆయన గార్ల్ ఫ్రెండ్ తో పర్మినెంట్ గా కలిసి ఉండడం కోసం ఓ భవనాన్ని కొనుగోలు చేశారు. ఈ భవనం ఖరీదు రూ.100 కోట్లు అని సమాచారం. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది.

Hrithik Roshan
హృతిక్ రోషన్ గురించి ఇటీవల ఆంగ్ల పత్రికలో వరుస కథనాలు వస్తున్నాయి. ఆయన 2014లో సుజేన్ ఖాన్ కు విడాకులు ఇచ్చారు. ఆ తరువాత సింగర్ సబా ఆజాద్ తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అప్పటి నుంచి వీరు వేర్వేరు ఇంట్లో ఉంటూనే ప్రత్యేక ప్రదేశాల్లో కలుసుకుంటున్నారు. కొన్ని ఫంక్షన్లతో పాటు హోటళ్లలో ఈ జంట మెరవడంతో వీరిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతుందని అర్థమైంది. అయితే సబా అజాద్ తన సోషల్ మీడియా ఖాతాలో హృతిక్ రోషన్ ఫొటో పెట్టి లవ్ సింబల్ పెట్టడంతో వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని కన్ఫర్మ్ అయింది.
ఈ నేపథ్యంలో ప్రియురాలికి దూరంగా ఉంటున్న హృతిక్ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆమెతో కలిసి ఉండడానికి బీచ్ పక్కన రెండతస్తుల భవనాన్ని కొనుగోలు చేశాడట. ఈ భవనం ఖరీదు సుమారు రూ.100 కోట్లు అని తెలుస్తోంది. తన ప్రియురాలి కోసం హృతిక్ రూ.100 కోట్లు ఖర్చు పెట్టడంపై ఆమెపై ఎంత ప్రేమ ఉందోనని బీ టౌన్ చర్చించుకుంటోంది. త్వరలో వీరిద్దరు కలిసి ఈ కొత్తింటికి మారే అవకాశం ఉంది. ఆ తరువాత జాలీగా కలిసుంటారు.

Hrithik Roshan
2000 సంవత్సరంలో ‘కహో.. నా ప్యార్ హై’ సినిమాతో సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన హృతిక్ ఆ తరువాత కొద్ది కాలంలోనే స్టార్ హీరోగా మారాడు. కండలు తిరిగిన దేహంతో ఉన్న అతనికి పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఇదే సమయంలో సంజయ్ ఖాన్ కుమార్తె సుజేన్ ఖాన్ ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరు అంతకుముందే స్నేహితులు కావడంతో ఇద్దరి మనసుల మధ్య ప్రేమ చిగురించింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే కొంత కాలం తరువాత ఏర్పడిన మనస్పర్థల కారణంగా 2014 నవంబర్ 1న విడాకులు తీసుకున్నారు.