Siddharth- Aditi Rao: దక్షిణాది హీరోగా, నిర్మాతగా పాపులారిటిని సాధించిన హీరో సిద్దార్థ్ హిందీలో కూడా రాణించేందుకు ప్రయత్నించాడు. అయితే బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించినప్పటికీ.. అక్కడ స్థిరంగా తనకంటూ స్థానాన్ని సంపాదించుకోలేకోపోయాడు. అయితే సినిమాల కంటే.. సిద్దార్థ్ తన లవ్ ఎఫైర్లతోనే నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌తోపాటు దక్షిణాది చిత్రాల్లో రాణిస్తున్న తెలుగు అమ్మాయితో డేటింగ్ చేస్తుండడం జాతీయస్థాయిలో వైరల్‌గా మారింది. కొన్ని రోజులుగా రూమర్లకే పరిమితమైన సిద్దార్థ్ లవ్ మ్యాటర్.. ఇప్పుడు నేషనల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Siddharth- Aditi Rao
బాల్య స్నేహితురాలితో వివాహం..
మణిరత్నం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సిద్దార్థ్ శంకర్ రూపొందించిన బాయ్స్ సినిమాతో హీరోగా మారారు. ఆ తర్వాత పూర్తిస్థాయి హీరోగా నిలదొక్కొకొనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 2003లో తన చిన్ననాటి స్నేహితురాలు, ఢిల్లీకి చెందిన మేఘనను వివాహం చేసుకున్నాడు. అయితే మూడేళ్ల దాంపత్య జీవితం తర్వాత 2007లో వ్యక్తిగత విభేదాల కారణంగా వీరు విడిపోయారు. అప్పటి నుంచి సిద్దార్థ్ ఒంటరిగానే ఉంటున్నారు..
సారా అలీ ఖాన్‌తో ఎఫైర్..
బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్‌తో కలిసి రంగ్ దే బసంతి సినిమాలో నటించాడు సిద్దార్థ్. ఆ సినిమా షూటింగ్ సమయంలో సోహా ఆలీ ఖాన్‌తో డేటింగ్ చేశారు. వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే సోదరుడు సైఫ్ ఆలీఖాన్, తల్లి షర్మిలా ఠాగూర్ సూచన మేరకు సిద్దార్థ్‌తో అఫైర్‌కు సోహా ఆలీఖాన్ బ్రేకప్ చెప్పింది.
శృతిహాసన్‌తో పెళ్లి వరకు వచ్చి..
సోహా ఆలీ ఖాన్‌తో బ్రేకప్ తర్వాత శృతిహాసన్‌తో సిద్దార్థ్ ఎఫైర్ మొదలుపెట్టాడు. శృతి కూడా బాలీవుడ్ కెరీర్‌పై దృష్టిపెట్టడంతో ముంబైలో వీరిద్దరూ సహజీవనం చేశారనే వార్తలు వచ్చాయి. వీరి ఎఫైర్‌కు శృతి తండ్రి కమల్ హాసన్ కూడా ఆమోదం తెలిపినట్లు అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి. 2010లో నుంచి వారిద్దరూ సహజీవనం చేశారు. అయితే సిద్దార్థ్ బిహేవియర్‌తో విసిగిపోయిన శృతి ఏడాదిన్నర సహజీవనం తర్వాత 2011 అక్టోబర్‌లో బ్రేకప్ చెప్పింది.
సమంతను చీటింగ్ చేసి..
శృతి హాసన్‌తో బ్రేకప్ జరిగిన రెండేళ్ల తర్వాత సమంతతో సిద్దార్థ్ ఎఫైర్ మొదలుపెట్టాడు. జబర్దస్త్ సినిమా షూటింగులో సిద్దార్థ్, సమంత మానసికంగా దగ్గరయ్యారు. దాంతో వారిద్దరు పీకల్లోతు ప్రేమ వ్యవహారంలో మునిగిపోయారు. పెళ్లికి కూడా సిద్దమయ్యారు. కాళహస్తిలో పూజలు కూడా చేయించుకోవడం తెలిసిందే. అదే సమయంలో కన్నడ హీరోయిన్ దీప్తి సన్నిధితో సిద్దార్థ్ డేటింగ్ చేస్తున్నట్టు తెలియడంతో సమంతను ఆమె స్నేహితులు హెచ్చరించారు. దాంతో సిద్దార్థ్, సమంత మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. తర్వాత బ్రేకప్ జరిగింది.

Siddharth- Aditi Rao
తాజాగా అదితిరావుతో..
సమంతతో బ్రేకప్ తర్వాత పలువురు హీరోయిన్లతో సిద్దార్థ్ డేటింగ్ వ్యవహారం మీడియాలో కనిపించింది. అయితే అవి రూమర్లకే పరిమితమయ్యాయి. తాజాగా అదితిరావు హైదరీతో సిద్దార్థ్ ఎఫైర్ కొనసాగుతున్నట్టు వార్తలు మీడియాలో వచ్చాయి. అయితే వాటికి బలం చేకూరేలా విధంగా ఇటీవల పలు సందర్భాల్లో అదితి, సిద్దార్థ్ కనిపించారు. పొన్నియన్ సెల్వన్ ఈవెంట్‌లో కూడా వారిద్దరూ కలిసి ప్రత్యేక ఆకర్షణగా మారారు. తాజాగా ముంబైలో ఓ హోటల్‌లో ఇద్దరూ చేతిలో చేతులు వేసుకుని కనిపించడంతో మీడియా దృష్టిని ఆకర్షించింది. వీరిద్దరి ఫొటోలు, వీరి డేటింగ్ వ్యవహారంపై ప్రస్తుతం ముంబై మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.